Sunday, April 13, 2025

కంచ గచ్చిబౌలి భూములను పరిశీలిస్తున్న కేంద్ర కమిటీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను కేంద్ర సాధికార కమిటీ పరిశీలిస్తోంది. ఈ భూముల వ్యవహారంలో క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సుప్రీం కోర్టు.. కేంద్ర పర్యావరణ అటవీ శాఖల సాధికార కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు నిన్న సాయంత్రం పర్యావరణ, అటవీ శాఖల సాధికారిక కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, మరో ముగ్గురు సభ్యులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు.

ఇవాళ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్న కమిటీ సభ్యులు.. కంచె గచ్చిబౌలి భూములను పరిశీలిస్తున్నారు. భూముల పరిశీలన తర్వాత అక్కడి పరిస్థితులను రికార్డు చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు సమావేశం కానున్నారు. అలాగే, ఈ వ్యవహారంలో హెచ్‌సీయూ వీసీ, సిబ్బంది, విద్యార్థులతో కూడా కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి పూర్తి వివరాలను కమిటీ, సుప్రీంకోర్టుకు అందజేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News