Wednesday, January 22, 2025

పూజా ఖేడ్కర్‌పై కేంద్రం విచారణ కమిటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారి పూజా ఖేడ్కర్ చుట్టూ అలుముకున్న వివాదంపై విచారణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఏక సభ్య కమిటీని నియమించింది. సిబ్బంది, శిక్షణ(డిఓపిటి) శాఖలోని అదనపు కార్యదర్శి ఈ వివాదంపై విచారణ జరుపుతారని వర్గాలు తెలిపాయి.

ఐఎఎస్‌లో స్థానం దక్కించుకునేందుకు శారీరక వైకల్యాల కేటగిరిలో, ఓబిసి కోటాలో లభించే ప్రయోజనాలను పూజా ఖేగ్కర్ దుర్వినియోగం చేశారని ఆమెపై అరోపణలు వచ్చాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆమె పుణె కలెక్టరేట్ నుంచి వాషిం జిల్లాకు బదిలీ అయ్యారు. గురువారం ఆమె వాషిం కలెక్టరేట్‌లో అసిస్టెంట్ లెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News