Monday, January 20, 2025

మెడికల్ కాలేజీల మంజూరులో కేంద్రం వివక్షత

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్ : దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు మెడికల్ కళాశాలలను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మెడికల్ కళాశాలలు మంజూరు చేయకుండా వివక్షత పాటిస్తోందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ విమర్శించారు. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించినప్పటికీ కేంద్రం నుంచి పైసా సహకారం లేకున్నా.. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ది పరుగులు పెడుతోందన్నారు. రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లి నైబర్‌హుడ్ కాలనీలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. సోమయ్యకు రూ. 60 వేలు, నందినికి రూ. 24 వేలు, వైద్యం ని మిత్తం నాగరాజుకు ఎల్‌ఓసీ సర్టిఫికెట్‌ను అందజేశారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేద లు సుఖ సంతోషాలతో ఉండేందుకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, న్యూట్రిషన్ కిట్, కెసిఆర్ కిట్ తదితర సంక్షేమ కార్యక్రమాలను చేపడుతు న్నారని అన్నారు.

వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు వైద్యం అనంతరం మంచి ఫుడ్, మందులకు కొనుగోలు వివిధ అవసరాల ని మిత్తం సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత నిధులను అందజేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతోందన్నారు. రానున్న ఎన్నికల్లో కేసీఆర్ మూడో సారి సీఎంగా గెలిచి కచ్చితంగా హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షులు రావుల పాటి మోజస్, ప్రధాన కార్యదర్శి మన్నె దామోదర్ రెడ్డి, బబ్లూ, రమేష్ రెడ్డి, సిరిగిరి కిర ణ్, ఎర్రం శేఖర్, జయదేవ్, శివ యాదవ్, టీవీ రాజు, సంతోష్, వాసు, శ్రావణ్, జనార్థన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News