Sunday, November 17, 2024

నేడు కేంద్ర ఎన్నికల సంఘం కీలక భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ ః దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తన కసరత్తును ముమ్మరం చేసింది. శుక్రవారం (నేడు) ఎన్నికల సంఘం పరిశీలకుల సమావేశం ఏర్పాటు అయింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందు జరిగే ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల షెడ్యూల్ విషయం కూడా శుక్రవారం తేలే వీలుంది. ఇదే విధంగా ఓట్ల ప్రజాస్వామిక ప్రక్రియను స్వేచ్ఛగా సజావుగా నిర్వహించేందుకు పాటించాల్సిన పద్ధతుల గురించి కూడా శుక్రవారం నాటి సమావేశంలో ఎన్నికల సంఘం అధికారులు అబ్జర్వర్స్‌తో సమీక్షిస్తారని వెల్లడైంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి , కమిషనర్లు ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తీస్‌గఢ్‌లలో పర్యటించింది. ఎన్నికల సన్నద్ధతను సమీక్షించింది. తెలంగాణలో సిఇసి పర్యటన గురువారం ముగిసింది. ఎన్నికల సంఘం వచ్చే కొద్ది రోజుల్లోనే ఐదు రాష్ట్రాలలో ఎన్నికల ప్రకటన వెలువరించేందుకు వీలుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News