హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల కోసం కేంద్రం నుంచి 20 కంపెనీల బలగాలు రప్పిస్తున్నామని, ఎన్నికల ఏర్పాట్లను సైతం కట్టుదిట్టం చేస్తున్నట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ తెలిపారు. ఇప్పటికే హుజురాబాద్ మూడు కంపెనీల బలగాలు చేరుకున్నాయని ఒకట్రెండు రోజుల్లో మిగతా 17 కంపెనీలు చేరుకోనున్నాయని తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో శాంతిభద్రతల దృష్టొ మొత్తం 20 కంపెనీల కేంద్ర బలగాలను రానున్నాయని, ఒక్కో కంపెనీలో 100 మంది కేంద్ర పోలీస్‌లు ఉంటారని తెలిపారు. హుజురాబాద్ లో ఇప్పటివరకు రూ.1.80 కోట్లతో పాటు రూ.6.11 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికకు మరో అబ్జర్వర్ ను నియమించినట్లు తెలిపారు. ఇప్పటివరకు మొదటి డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్న ఓటర్లు 97.6 శాతం ఉండగా 2వ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్న ఓటర్లు 59.9 శాతం ఉన్నారన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి దాదాపు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ తెలిపారు.
హుజురాబాద్‌కు 20 కంపెనీల కేంద్ర బలగాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -