Monday, December 23, 2024

మూడేళ్ల గ్రాంట్లు ఎగవేసిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: తెలంగాణకు రావాల్సిన వార్షిక గ్రాంట్లు విడుదల విషయంలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్ లోక్ సభ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన వార్షిక గ్రాంట్ల విషయమై తాను స్వయంగా ప్రస్తావించగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన స మాధానం దారుణంగా ఉందని సోమవారం ఆయన ఇక్కడ వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన నిధులపై తాను లిఖితపూర్వకంగా అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానం దారుణంగా ఉందన్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్ళకు సంబంధించి ఏడాదికి రూ.450 కోట్ల చొప్పున రూ.1350 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి డని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 94 (2) ప్రకారం ఈ నిధులు విడుదల చేయాల్సి ఉండగా కేంద్రం కావాలనే వివక్ష చూపుతుందని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వివక్షత వల్లనే 2019/-20, 2020/-21, 2022/-23 సంవత్సరాలకు తెలంగాణకు ఎలాంటి గ్రాంట్లు విడుదల చేయలేదని నామా పేర్కొన్నారు. నీతి అయోగ్, కేంద్రం వద్ద ఉన్న వనరుల లభ్యత ఆధారంగా తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడం జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.అన్ని విషయాల్లోనూ కేంద్రం తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష చూపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .ఈ విషయమై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రం దృష్టికి తీసికెళ్లడం జరిగిందని, తాను కూడా పార్లమెంట్ లో పలుమార్లు స్వయంగా మాట్లాడడం జరిగిందని నామా పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్రం వెంటనే స్పందించి మూడు సంవత్సరాలకు సంబంధించి తెలంగాణకు రావాల్సిన రూ.1350 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని నామా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేకుంటే తెలంగాణ ప్రజలే రానున్నకాలంలో కేంద్రానికి తగిన గుణపాఠం చెబుతారని నామా హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News