Monday, December 23, 2024

గూడెం.. మోడికుంట పథకాలకు కేంద్రం ఆమోదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గోదావరి నది పరివాహకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మరో రెండు సాగునీటి పారుదల పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. శుక్రవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సాంకేతిక సలహా కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గూడెం , మోడికుంట వాగు ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రతిపాదనలపై చర్చించి ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం ఆమోదముద్ర వేసింది.ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ప్రస్తుత ములుగు జిల్లా పరిధిలో ఉన్న మోడికుంట వాగు నీటి నిలువ సామర్ధం 0.04టిఎంసీలు . వాజేడు మండలంలో సుమారు 13500 ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది.

సీతారామా బ్యారేజికి ఎగువన చత్తిస్‌గఢ్ నుంచి వచ్చి గోదావరినదిలో కలిసే వాగుపైన రూ.500కోట్ల ప్రాధమిక అంచనాలతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఆనకట్ట పై బాగంతో పాటు ఆయకట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండగా మిగిలిన ఆయకట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉంది. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం 201718లోనే రూ.78కోట్ల వ్యయం కాగలదని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ , ఏపి 15;85 నిష్పత్తిలో నిధులు కేటాయించాలని తెలంగాణ కోరుతోంది. గూడెం ఎత్తిపోతల పథకానికి కూడా కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపింది. రూ.138కోట్ల ప్రాధమిక అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 3టిఎంసీల గోదావరి నదీజలాలను ఉపయోగించుకుని 30వేల ఎకరాల ఆయకట్టుకు ఆందించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మూడు మండలాల పరిధిలో 43గ్రామాలకు తాగునీరు సాగునీరు లభించనుంది. గూడె ం , మోడికుంట వాగు ప్రాజెక్టులపై జరిగిన ఈ సమావేశంలో కేంద్ర జలసంఘం చైర్మన్ రుష్విందర్ వోరా, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి రజత్ కుమార్ , ఈఎన్సీలు మురళీధర్, హరీరాం , సీఎం ఒఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, సీఈలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News