Friday, December 27, 2024

రాష్ట్రానికి మరో అవార్డు

- Advertisement -
- Advertisement -

మిషన్
భగీరథకు దక్కిన
గౌరవం
ఇంటింటికీ శుద్ధ
జలం ఆందిస్తున్న
ఏకైక రాష్ట్రంగా
గుర్తింపు సిఎం కెసిఆర్ అభినందనలు

మన తెలంగాణ/హైదరాబాద్ : ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మానన పుత్రిక అయిన మిషన్ భగీరథతో రాష్ట్రంలోని ప్రతి ఆవాసంతో పాటు మారుమూల, అటవీ, కొండ ప్రాంతాల్లో ని ఏ ఒక్క గిరిజన నివాసాన్ని కూడా వదలిపెట్టకుండా రక్షి త తాగు నీరు సరఫరా అవుతుంది. శుద్ధి చేసిన తాగు నీటిని ఇంటింటికీ నల్లా ద్వారా అందజేస్తూ మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచింది. మిషన్ భగీరథ పథకం అమలు తీరును ఇటీవల కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వా రా పరిశీలించింది.తెలంగాణ వ్యాప్తంగా రాండమ్‌గా ఎంపిక చేసిన 320 గ్రామాల్లో జాతీయ స్థాయి స్వతంత్ర సంస్థ ద్వారా తనిఖీ నిర్వహించింది.

భగీరథ నీటి నాణ్యత, సరఫరా తీరును పరిశీలిస్తూనే, ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఆ సమాచారాన్ని విశ్లేషించింది. మిషన్ భగీరథతో ప్రతిరోజూ ఇంటింటికి నల్లాతో నాణ్యమైన తాగునీరు తలసరి 100 లీటర్లతో అందుతున్నట్టు గుర్తించింది. తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకం నాణ్యత, పరిమాణంలో ఇప్పటికే దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న నిర్ణయానికి వచ్చింది. అన్ని గ్రామాలలో ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా నిరాటంకంగా, ప్రతిరోజూ నాణ్యమైన తాగునీరు అందిస్తున్నట్లు గుర్తించింది. ఈ క్రమంలో ‘రెగ్యులారిటీ కేటగిరీ’ లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా గుర్తించి జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపిక చేసింది.

తాగు నీటి రంగంలో అద్భుతమైన, అనితరసాధ్యమైన పనితీరు కనపరుస్తూ మిషన్ భగీరథ దేశంలోనే ఆదర్శవంతంగా నిలచింది. అక్టోబరు 2 గాంధీ జయంతి నాడు ఢిల్లీలో అవార్డును అందుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. తెలంగాణ ప్రగతిని గుర్తించి, మరో సారి జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపిక చేసినందుకు, కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది.

సిఎం కెసిఆర్ అభినందనలు

రాష్ట్రానికి మరో అవార్డు దక్కడంతో ముఖ్యమంత్రి కెసిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంబంధిత శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే తెలంగాణకు మంచినీటి సరఫరాలో పలు అవార్డులు రివార్డులు వచ్చాయి. దేశంలో వంద శాతం ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా గుర్తింపు పొందింది. వంద శాతం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా తెలంగాణకు గుర్తింపు వచ్చింది.

తాజాగా దేశంలో అత్యుత్తమ అద్భుత ప్రతిభ కనబరచిన రాష్ట్రంగా తెలంగాణకు అవార్డు వరించింది. స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రానికి వివిధ కేటగిరీలలో మరో 13 అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను కూడా అక్టోబర్ 2వ తేదీననే రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం అందుకోనుంది. దీంతో ఒకే రోజున తెలంగాణ ప్రభుత్వం ఏకంగా 14 అవార్డులను ప్రభుత్వం అందుకోనుంది. కాగా ఇది సిఎం కెసిఆర్ సహకారం వల్లే రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఇస్తున్న సహకారం కూడా మరవలేనిదన్నారు. ఈ అవార్డులు తమ బాధ్యతను మరింత పెంచాయన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News