Wednesday, January 22, 2025

అప్పుల్లోనూ వివక్షే!

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌పై అమ్మ ప్రేమ.. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ

ఎపికి 3 రూ.25వేల కోట్ల రుణం
తెలంగాణకు రూ.9వేల కోట్లకే అనుమతి

కావాలనే కక్ష సాధింపు తెలంగాణకు
జరిగిన నష్టాన్ని భర్తీ చేయని రిజర్వ్ బ్యాంకు
రెండో త్రైమాసికంలో అప్పులకు షెడ్యూల్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) పక్షపాతధోరణితో వ్యవహరిస్తూనే ఉన్నాయనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌బిఎం ప్రకారం రుణాలను సమీకరించుకునేందుకు కూడా కేం ద్రం, ఆర్‌బిఐ మోకాలడ్డుతూనే ఉన్నాయని అధికారవర్గాలే కాకుండా టిఆర్‌ఎస్ చెందిన సీనియర్ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. కేంద్ర ప్ర భుత్వం, ఆర్‌బిఐల తప్పుడు విధానాలు, లోపభూయిష్టమైన నిర్ణయాల మూలంగా వేల కోట్ల రూపాయలను నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి ఆ న ష్టాన్ని భర్తీ చేసే ప్రయత్నాలను రిజర్వ్ బ్యాంకు చేయకపోవడం దురదృష్టకరమని కొందరు సీనియర్ అధికారులు మండిపడుతున్నారు. 2022-23వ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్, మే నెలల్లో అప్పులు తెచ్చుకోవడానికి తెలంగాణ రా ష్ట్రానికి అడ్డుంకులు సృష్టించిన ఆర్‌బిఐ కనీసం ఇప్పుడు జరుగుతున్న వేలంలో ఆ నష్టాన్ని పూరించే ప్రయత్నాలు కూడా చేయకపోవడం బాధాకరమని అంటున్నారు. తాజాగా ఆర్‌బిఐ ఢూండో క్వార్టర్‌లో అంటే జూలై. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దేశంలోని ఏయే రాష్ట్రాలు సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టి ఎంతెంత నిధులను అప్పు లు తెచ్చుకోవాలో కూడా రిజర్వ్ బ్యాంకు ఒక షెడ్యూలును ఖరారు చేసింది. ఈ షెడ్యూలు ప్రకారం అన్ని రా ష్ట్రాలు కలిపి ఈ మూడు నెలల్లో 2,11,552 కోట్ల రూపాయల నిధులను సమీకరించుకునేందుకు రిజర్వు బ్యాంకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రం నెలకు రూ. 3వేల కోట్ల లెక్కన కేవలం రూ.9వేల కోట్ల నిధులను సమీకరించుకునేందుకు ఆర్‌బిఐ అనుమతు లు ఇచ్చింది.

అదే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రా ష్ట్రానికి రికార్డుస్థాయిలో రూ.25 వేల కోట్లను అప్పులుగా సేకరించుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది. జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెల ల్లో సెక్యూరిటీ బాండ్ల వేలానికి 13సార్లు వేలం జరుగుతుండగా ప్రతిసారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సె క్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టి పాల్గొనే విధంగా మంజూ రు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఈనెల 5న జరగబోయే సెక్యూరిటీ బాండ్ల వేలంలో కేవలం రూ.3వేల కోట్లను సమీకరించుకునేందుకు ఆర్‌బిఐ అనుమతులిచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా రూ.2వేల కోట్ల లెక్కన జులైలో నాలుగుసార్లు వేలం జరుగుతుందని, ఈ నాలుగుసార్లు కలిపి ఏకంగా రూ.8వేల కోట్ల నిధులను సమీకరించుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఆగస్టు నెలలో తెలంగాణకు రెండు విడతలుగా మూడు వేల కోట్ల రూపాయలను రుణాలను సేకరించుకునేందుకు అనుమతులు ఇచ్చిన ఆర్‌బిఐ అదే ఆంధ్రప్రదేశ్ వి షయానికి వచ్చేసరికి ఏకంగా 9,500 కోట్ల రూపాయల నిధులను సమీకరించుకునేందుకు అనుమతులు ఇచ్చిం ది. అదే సెప్టెంబర్ నెలలో తెలంగాణకు రెండు విడతలు కలిపి మూడు వేల కోట్ల అప్పుకు అనుమతించిన ఆర్‌బిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 7,500 కోట్ల రూపాయలను అప్పులు సేకరించుకునేందకు అనుమతులు ఇచ్చింది.

ఇదంతా పరిశీలిస్తుంటే తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐలు ఎంతటి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయో అర్థ్ధం కోరుతున్నారు. కేవలం రాజకీయపరమైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తెలంగాణ ప్రజలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని, ఈ చర్యల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అర్ధంచేసుకోవాలని ఆ అధికారులు కోరుతున్నారు. వాస్తవానికి తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలుకు, ప్రభుత్వ పాలనాపరమైన ఖర్చులకు నెలకు సగటున రూ.16 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని, అందులో 12 వేల కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర సొంత ఆదాయ వనరుల రూపంలో వస్తున్నాయని, మిగతా నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని సమీకరించుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఇదే అంశాలను 2022-23వ వార్షిక బడ్జెట్‌లోనే ప్రవేశపెట్టామని, ఆ బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ కూడా పరిశీలించాయని, ఇలా అన్నీ తెలిసి కూడా తెలంగాణ ప్రభుత్వానికి నిధులు రాకుండా చేయాలనే కుట్రతోనే ఇలా వ్యవహరిస్తున్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

మూడు నెలల్లో రూ.2,11,552 కోట్లకు బాండ్ల వేలం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జులై. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఏకంగా 13 సార్లు సెక్యూరిటీ బాండ్లను వేలంవేసి 2,11,552 కోట్ల రూపాయల నిధులను సమీకరించుకునేందుకు రాష్ట్రాలకు అనుమతులు ఇచ్చింది. ఇందులో ఈనెల 5వ తేదీన 13 వేల కోట్ల రూపాయల నిధుల సమీకరణకు జరిగే వేలంలో ఎపి, అస్సాం, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు పాల్గొంటున్నాయి. ఈనెల 12న జరగబోయే వేలంలో 10,300 కోట్ల నిధులకు గానూ ఎపి, హర్యానా, మహారాష్ట్ర, పాండిచ్చేరి, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు పాల్గొంటాయి. ఈనెల 19న 15,390 కోట్ల నిధుల సమీకరణకు జరగబోయే వేలంలో ఎపి, అస్సాం, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, యూపి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈనెల 26వ తేదీన జరగబోయే వేలంలో 23,950 కోట్ల రూపాయల నిధుల సమీకరణకు జరగబోయే వేలంలో ఎపి, గోవా, గుజరాత్, హర్యాన, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరాఖాండ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి. ఆగస్టు నెలలో ఐదుసార్లు, సెప్టెంబర్ నెలలో నాలుగుసార్లు సెక్యూరిటీ బాండ్ల వేలానికి ఆర్‌బిఐ షెడ్యూల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News