Thursday, January 23, 2025

తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులిచ్చారో చెప్పండి?

- Advertisement -
- Advertisement -

Central government funds to telangana state

తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శం! ముఖ్యమంత్రి కెసిఆర్ తొలి ఏకాదశి నాడు మొత్తం రెండు గంటల ప్రెస్ మీట్‌లో ప్రారంభం లో మాట్లాడుతూ హైద్రాబాద్‌లో జరిగిన బిజెపి కార్యవర్గ సమావేశంలో మోడీ జోగులాంబ… ఈ అంబ ఆ అంబ అని సదివిపోయిండు తప్ప దేశానికి ఉపయోగపడే దేని మీద మాట్లాడలేదు అని కెసిఆర్ ఈ దేశ ప్రధానిని ఉద్దేశించి అంటే మధ్యలో మళ్లీ మతం గురించి తీసుకువచ్చి రాజకీయాలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. మతం అనే పునాదుల్లో ఒక గొప్ప భారతాన్ని ఎన్నటికీ నిర్మించలేరనే విషయం ఈ దేశ ప్రధాని, బిజెపి నాయకులు తెలుసుకుంటే మంచిది.
కెసిఆర్ మాట్లాడిన ఏ ఒక్క అంశం గురించి మాట్లాడరు. కెసిఆర్ మాట్లాడిన చాలా అంశాలు ఉన్నాయి కానీ వాటి గురించి మాట్లాడకుండా వాటిని దాటవేస్తూ బండి సంజయ్ మాట్లాడుతున్న వాటికి తలా తోక లేకుండా ఉంది. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం హైద్రాబాద్‌లో పెట్టినప్పుడు దేశ ప్రధానిగా ఎలాంటి సందేశం ఇవ్వనున్నారోనని దేశం మొత్తం ఆసక్తిగా చూసింది కానీ ప్రధాని మాట్లాడిన మాటల్లో స్పష్టమైన విధానం లేదు. దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపేందుకు చర్యలు, విధానాలు తీసుకుంటారో చెప్పాలి. కానీ జాతిని ఉద్దేశించి ఎలాంటి సందేశం ఇవ్వలేదు. కెసిఆర్ స్పష్టంగా మోడీని హైద్రాబాద్ వచ్చే ముందు సూటిగా కొన్ని ప్రశ్నలను అడిగారు. వీటికి సమాధానం చెప్పకుండా జాతీయ కార్యవర్గ సమావేశం ఎందుకోసం పెట్టినట్టు?
గడిచిన ఎనిమిదేళ్ళ పాలనలో మా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పండి. బిజెపి పాలిత ప్రాంతాలకు ఇస్తున్నటు వంటి నిధులు ఇతర పాలిత రాష్ట్రాలకు ఇవ్వకుండా వివక్ష చూపుతూ బిజెపి పాలన సాగుతుంది. రాష్ట్రాలు అంటే దేశంలో అంతర్భాగమే కదా మరి వివక్ష ఎందుకు? అంటే మీకు బిజెపి పాలిత రాష్ట్రాలు ఒకలెక్క ఇతర పాలిత రాష్ట్రాలు ఒకలెక్క అన్నమాట. యావత్ దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత దేశ ప్రధానిగా ఉన్నదనే విషయాన్ని మరవకూడదు. కెసిఆర్ ప్రెస్ మీట్ లో అడిగిన ప్రశ్నలు ఇవి: 1) రూపాయి విలువ ఎప్పుడూ లేనంత ఎందుకు పడింది? 2)ద్రవ్యోల్బణం, పెట్రోల్ ధరలు ఎందుకు విపరీతంగా పెరిగాయి? 3) జిడిపి ఎందుకు పెరగడం లేదు? 4) లక్షా నలభై వేల టిఎంసిలలో సగమే ఎందుకు వాడుకుంటున్నాం? మిగతా సగం వృథాగా పోతున్నాయి. ఎందుకు వాడుకోవడం లేదు? 5) కోటి ఉద్యోగాలు పోయాయి. నిరుద్యోగ రేట్ విపరీతంగా ఎందుకు పెరుగుతోంది? 6) ప్రతిపక్ష పార్టీలు అధికారంలో వున్న చోట ప్రభుత్వాలను ఎందుకు అప్రజాస్వామికంగా కూలుస్తున్నారు? 7) మీ పార్టీ అధికారంలో వున్న చోట తలసరి ఆదాయం ఎందుకు తక్కువగా వుంది? ప్రతిపక్ష పార్టీలు అధికారంలో వున్న చోట ఎందుకు ఎక్కువగా వుంది? 8) ఎనిమిదేళ్లలో మీరు చేసిన మంచి పని కనీసం ఒక్కటి చెప్పండి?

వీటి గురించి ఏ ఒక్క బిజెపి నాయకుడు పెదవి విప్పలేదు. కానీ అంబ అంటే అమ్మ అని తెలువని మీరు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. మీరు హిందువులు హిందూ మతం అని చెప్పుకోవడం సిగ్గుచేటు. అలా చెప్పుకోవడానికి కూడా అర్హులు కారు. ఏ మతం కూడా మనుషులను విడదీస్తూ రాజకీయం చేయమని చెప్పలేదు. అలాంటిది మతం పేరుతో బిజెపి రాజకీయం చేయడం ఈ దేశానికి పట్టిన దరిద్రమే అని చెప్పవచ్చు. జాతీయ కార్యవర్గ సమావేశం పేరిట బిజెపి జాతీయ నాయకులకు తెలంగాణ వచ్చే ముందే కెసిఆర్ స్పష్టంగా అడిగిన తొమ్మిది ప్రశ్నలకు సమాధానం ఎలాగూ చెప్పలేదు దేశ ప్రధాని. కనీసం ఈ ప్రశ్నలకు అయిన మీ దగ్గర సమాధానం ఉన్నదా? ఏ ఒక్క దానికి సమాధానం ఉండదు కాబట్టే ఏదో ఒక అనవసరమైన అంశాన్ని తీసుకువచ్చి దానికి మతం అనే రంగును పూసి రాద్దాంతం చేస్తూ రాజకీయం చేస్తున్నారు.

ఒక నాయకుడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అంతేకాని ఏదో ఒక గొడవను, అల్లర్లను సృష్టిస్తూ పబ్బం గడపకూడదు. కెసిఆర్ ఈ ప్రెస్ మీట్ కంటే ముందు ఇచ్చిన స్పీచ్, ఇప్పుడు ఇచ్చిన స్పీచ్‌లో నిజంగా ఎక్కడా సుత్తి లేకుండా అప్పుడు ఇప్పుడు సూటిగా సంధించిన ప్రశ్నలు, సంధించిన బాణాలు చాలా అద్బుతం. ముఖ్యంగా వీడియో క్లిప్పింగ్స్ చూపించి అడిగిన ప్రశ్నలు మున్ముందు జరగబోయే ఎన్నికల్లో ఇవి ప్రముఖ పాత్ర పోషించబోతున్నాయి. కెసిఆర్ దేశ రాజకీయాలకు ఒక కొత్త నిర్వచనం చెపుతున్నారని అర్థం చేసుకోవచ్చు. కెసిఆర్ అడిగిన ప్రశ్నలు అందరినీ ఆలోచింపజేసేవే. ప్రశ్నించడానికి భయపడుతున్న ఈ సమయంలో ప్రశ్నించడానికి ఒక అడు గు ముందు పడిందనే చెప్పాలి. మరి సమాజం ఆ అడుగులో అడుగేసుకుంటూ ముందుకు నడవాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్ రాజకీయాలకు, దేశ అభివృద్ధికి కెసిఆర్ లాంటి నాయకులు ఖచ్చితంగా అవసరం ఉన్నది. ఒకటి మాత్రం నిజం ప్రెస్ మీట్‌లో కెసిఆర్ మాట్లాడిన మాటలు అక్షర సత్యం చరిత్రలో నిలిచిపోతాయి అని మాత్రం చెప్పగలను.

కళ్లెం నవీన్ రెడ్డి
9963691692

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News