Monday, December 23, 2024

విత్తన ధరలకు రెక్కలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బహుళజాతి విత్త న కంపెనీ లాబీల ఒత్తిళ్లకు కేంద్రం తల వంచింది. చడీ చప్పుడు లేకుండా సర్కారు పత్తి రైతుల నెత్తిన విత్తన ధరల పిడుగులు కురి పించింది. కేంద్ర వ్యవసాయశాఖ వచ్చే పంటల సాగు సీ జన్‌కు సంబంధించి పత్తి విత్తన ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జాతీయ స్థాయి లో పత్తి రైతుల అభిప్రాయాలు గాని, రైతు సంఘాల మనోగతంగాని, పత్తిసాగును ప్రోత్సహి స్తున్న రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయలుగాని తీసు కోకుండా , విత్తన ధరల పెంపుదలకు సం బం ధించి కనీసం వారితో నామమాత్రపు చర్చలు కూడా జరపకుండా బహుళజాతి విత్తన కంపెనీ లకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం బిటి పత్తి విత్తన ధ రలను భారీగా పెంచుతూ, ఏకపక్షంగా నోటి ఫికేషన్ జారీ చేసింది. 20232024 ఆర్థ్ధిక సంవత్సరంలో రానున్న వ్యవసాయ సీజన్‌కు సం బంధించి బిటి పత్తి విత్తన ధరలు ప్యాకెట్‌కు రూ. 43 పెంచింది.

ఈ పెంపుదల వచ్చే ఏప్రిల్ నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. బిటి పత్తి విత్తనాల ధరల ప్రస్తుతం బిటి 2రకం ప్యాకె ట్ రూ.810 ఉండగా, దీన్ని రూ.853కు పెంచింది. ఒక్కో ప్యాకెట్ మీద రూ.43ధర పెం చింది. ఒక్కో ఎకరానికి రెండు ప్యాకెట్ల పత్తి విత్తనాలు అవసరం . ఈ లెక్కన ఒక్కో ఎకరం సాగుకు పత్తి విత్తనాల కొనుగోలుపైనే 86 రూ పాయలు అదనపు భారం భరించాల్సివస్తుంది. దేశంలో పత్తి సాగు సగటు విస్తీర్ణం 3కోట్ల ఎకరాల మేరకు ఉంది. ఈ పంట సాగుకు 6కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం . వచ్చే సీజన్‌లో పత్తి విత్తనాల కొనుగోలుకు రైతుల పై రూ.258 కోట్లు అదనంగా భారం భరించక తప్పదు. అంతేకాకుండా అకాల వర్షాల వల్ల మొలక దశలోనే నాటిని పత్తి విత్తనాలు సరిగా మొలకెత్తకపోవటం, నేలలో క్రిమికీటకాలకు పత్తి విత్తానాలు కొంతశాతం ఆహారంగా మారటం ,

పుచ్చు, బూజు పట్టి పోవటం తిదితర కారణాల వల్ల ఒక్కో ఎకరానికి అదనంగా రైతులు మరో ప్యాకెట్ పత్తి విత్తానాలను అదనంగా కొని రిజర్వ్‌లో ఉంచుకోవాల్సి వస్తోంది. దీంతో మరో 3కోట్ల రిజర్వ్ విత్తన ప్యాకెట్ కొనుగోలు వల్ల రూ.129కోట్లు భరించాల్సి వస్తుంది. దీంతో ఈ సారి పత్తి సాగు చేయాలంటే రైతులు మొత్తంగా రూ.387కోట్లు అదనపు భారం భరించాల్సిన పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం కల్పించింది.
విత్తన ధరల పెంపుపై పత్తి రైతుల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తన ధరల పెంపుదల వల్ల రైతులనుంచి ఆందోళనలు పుట్టుకొస్తున్నాయి. భారత జౌళి రంగాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతామని ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనలు ధరల పెంపుదల ద్వారా పత్తిసాగులో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహమా అని రైతులు నిలదీస్తున్నారు. దేశంలో వేలాది జౌళి పరిశ్రమలకు ఏడాదంతా చేతి నిండాపనికల్పిస్తున్న పత్తి రైతులను కష్టకాలంలో ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏవిధమైన ప్రొత్సాహాకాలు ఇవ్వకపోగా విత్తన కంపెనీల వత్తిళ్లకు తలొగ్గి ఏకపక్షంగా పత్తి విత్తన ధరలు పెంచటం పట్ల మోడి సర్కారుపై భగ్గుమంటున్నారు.
విత్తభారంలో తెలంగాణరైతుపైనే అధికం!
దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి ఏటా సుమారు మూడు కోట్ల ఎకరాల్లో పత్తి సాగవుతుంది. అయితే అందులో కాటన్‌బౌల్ ఆప్ సౌత్ ఇండియాగా పేరుగాంచిన తెలంగాణపైనే పత్తి విత్తన ధరల పెంపు భారం అధికంగా పడనుంది. తెలంగాణలో పత్తి సాగు సాధారణ విస్తీర్ణం 70లక్షల ఎకరాల వరకూ ఉంటొంది. రాష్ట్ర ప్రభుత్వం గత సీజన్‌లో 80లక్షల ఎకరాల్లో పత్తిసాగు చేయించాలని భావించినప్పటికీ 50లక్షల ఎకరాల వద్దనే ఆగిపోయింది. గతేడాది పత్తి ధరలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ దిగుబడి ఆశించన స్థాయిలో రాలేదు. ఎకరానికి 15నుంచి 20క్వింటాళ్లు రావాల్సివుండగా పదికే పరిమితమైంది.
సిసిఐ నిర్వీర్యం
పత్తి పంట కొనుగోలులో ప్రధాన పాత్ర వహించే కాటన్ కార్పోరేషన్‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు వున్నాయి. 202324కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో సిసిఐకి నామమాత్రపు నిధులు కేటాయింపులు కూడా లేకుండా చేయటం రైతుల విమర్శలకు మరింత బలం చేకూరింది. ఈ పరిస్థితుల్లో జౌళి పరిశ్రమ రంగానికి మూలధారంగా ఉన్న పత్తి రైతుల సమస్యలు ఏ మాత్రం పట్టించుకోకుండా పత్తి విత్తన ధరలను పెంచటం పట్ల కేంద్ర ప్రభుత్వంపై రైతులనుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News