- Advertisement -
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు పిఎంజెజెబివై, పిఎంఎస్‌బివైల ప్రీమియంలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పెంచింది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పిఎంజెజెబివై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన( పిఎంఎస్‌బివై) పథకాల ఆర్ధిక వెసులుబాటు కోసం ఈ పెంపుదల నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాలు తెలిపాయిపిఎంజెజెబివై . ఇప్పటివరకూ వార్షిక ప్రీమియం రూ 330 ఉండగా దీనిని ఇక నుంచి రూ 436గా పెంచారు. ఈ విధంగా రోజువారిగా ఈ ప్రీమియం రేటు రూ 1.25 పైసలు పెరిగింది. కొత్త ప్రీమియం రేట్లు జూన్ 1 నుంచి (నేటి) అమలులోకి వస్తాయి. ఈ స్కీంలకు సంబంధించి తలెత్తుతున్న నష్టదాయక ప్రతికూల క్లెయిమ్స్ ద్వారా తలెత్తుతున్న కష్టనష్టాల నుంచి అధిగమించేందుకు పెంపు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
- Advertisement -