Friday, December 20, 2024

కనీస వేతనాన్ని పెంచిన  కేంద్ర ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

కొత్త వేతనాలు అక్టోబర్ 1 నుంచి అమలు

న్యూఢిల్లీ: వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (విడిఏ)ని సవరించడం ద్వారా కనీస వేతన రేట్లను పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. కొత్త వేతనాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

“కార్మికులకు, ప్రత్యేకించి అసంఘటిత రంగంలోని కార్మికులకు మద్దతు ఇచ్చే ఒక ముఖ్యమైన చర్యలో, వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్ (VDA)ని సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కనీస వేతన రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న జీవన వ్యయాన్ని కార్మికులు తట్టుకోవడానికి ఈ సర్దుబాటు ఉద్దేశించబడింది ”అని అధికారిక పిఐబి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

భవన నిర్మాణం, లోడింగ్ , అన్‌లోడింగ్, వాచ్ అండ్ వార్డ్, స్వీపింగ్, క్లీనింగ్, హౌస్ కీపింగ్, మైనింగ్ , వ్యవసాయం వంటి వివిధ రంగాలలో నిమగ్నమైన కార్మికులు సవరించిన వేతన రేట్ల నుండి ప్రయోజనం పొందుతారు. కనీస వేతన రేట్లను నైపుణ్యం ఆధారంగా అంటే, నైపుణ్యంగల, నైపుణ్యం లేని, సెమీ స్కిల్డ్, హైలీ స్కిల్డ్ గా వర్గీకరించి, అలాగే భౌగోళిక ప్రాంతం ఆధారంగా ఏ,బి,సి అని వర్గీకరించడం జరిగింది.

ఏ గ్రూపులో వచ్చే నిర్మాణం, ఊడ్చే, శుభ్రపరిచే, లోడింగ్ అన్ లోడింగ్ పనులు చేసే నైపుణ్యంలేని వారికి రోజుకు రూ. 783(నెలకు రూ. 20358), సెమీ-స్కిల్డ్ కార్మికులకు రోజుకు రూ. 868(నెలకు రూ. 22568), ఇక స్కిల్డ్, క్లారికల్, ఆయుధాలు లేని వాచ్ అండ్ వార్డ్స్ కి రోజుకు రూ. 954(నెలకు రూ. 24804),  బాగా నైపుణ్యంగల (హై-స్కిల్డ్) ఉద్యోగులకు రోజుకు రూ. 1035(నెలకు రూ. 26910) చొప్పున ఉంటుందని అధికారిక నోటిఫికేషన్ పేర్కొంది.

పారిశ్రామిక కార్మికులకు వినియోగదారుల ధరల సూచికలో ఆరు నెలల సగటు పెరుగుదల ఆధారంగా ఏప్రిల్ 1 – అక్టోబర్ 1 నుండి అమలులోకి వచ్చే విడిఏని కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తుంది. చివరి సవరణ ఏప్రిల్ 2024లో జరిగింది.

Salaries

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News