Monday, December 23, 2024

పేద ఖైదీల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : జైళ్లలో శిక్షను అనుభవిస్తున్న పేద ఖైదీలకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు గాను సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కోర్టు విధించిన జరిమానాలను కట్టలేని, బెయిల్ ఫీజును కట్టలేని పేద ఖైదీలకు కోసం పథకాన్ని తీసుకొస్తున్నామని తెలిపింది. సరైన చదువు లేక, అతి తక్కువ ఆదాయం ఉన్న ఖైదీలకు ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పింది. సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల కోర్టుకు జరిమానాలు కట్టలేని ఎంతో మంది పేద ఖైదీలు జైళ్లలోనే మగ్గిపోతున్నారని, అలాంటి వారికి ఈ పథకం ఎంతో సాయపడుతుందని తెలిపింది. దీనికోసం ఈ-ప్రిజన్ ప్లాట్‌ఫామ్ ను కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించింది. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా నిజమైన పేద ఖైదీలను గుర్తించడం సులభతరం అవుతుందని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News