Friday, November 22, 2024

ఆన్‌లైన్ షాపింగ్… పరిమిత ప్రయాణాలు

- Advertisement -
- Advertisement -

Central Government issues fresh Covid‌ advice to States

పండుగల వేళ కేంద్రం కరోనా గైడ్‌లైన్స్
రాష్ట్రాలకు సమగ్ర సలహాల జారీ
5శాతం కేసులున్న ప్రాంతాలపై దృష్టి

న్యూఢిల్లీ : దేశంలో దివాలీ ఇతర పండుగల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తాజా కొవిడ్‌ సలహాలు సూచనల నియమావళిని వెలువరించింది. దీని మేరకు పౌరులు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించేలా చూడాలని పర్యవేక్షించాలని సూచించింది. శనివారం ఈ మేరకు అడ్వయిజరీ వెలువరించింది. సాధ్యమైనంతవరకూ ప్రయణాలు పెట్టుకోవద్దు. ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వండి , పండుగలు, ఉత్సవాలకు ప్రత్యేకించి కంటైన్మెంట్ జోన్లు, వైరస్ ఇప్పటికీ పొంచి ఉన్న జిల్లాల్లో గుంపులుగా తిరగరాదని ఈ విధంగా పౌరులకు జాగ్రత్తలు తెలియచేయాలని సూచించారు. టెస్టులలో 5 శాతం కన్నా ఎక్కువగా పాజిటివ్ కేసులు తలెత్తితే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో పలు ప్రాంతాలలో కరోనా తగ్గుముఖం పట్టింది.

టీకాల కార్యక్రమం వందకోట్ల డోస్‌ల స్థాయితో విజయవంతం అయింది. అయితే ఇప్పటికీ థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉందని, జనం సమూహికంగా తిరగడం, మాస్క్‌లు, భౌతికదూరాలను త్యజించడం జరిగితే తిరిగి వైరస్ విజృంభిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా పొరుగుదేశాలలో, యూరప్ అమెరికాలో వైరస్ విజృంభణ , సరికొత్త వేరియంట్లతో సమస్యలు తీవ్రతరం అయ్యాయి. అయితే ప్రజల జీవన ఆచారవ్యవహారాల క్రమంలో పండుగలు, ఉత్సవాల దశలో ఎక్కువ మంది ఎక్కువసేపు ఒకే చోట గుమికూడటం సాధారణ ప్రక్రియ అయింది. ఈ స్థితిలో వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమానికి రాష్ట్రాలు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం సూచించింది.

ప్రభుత్వం వెలువరించిన అడ్వయిజరీలోని అంశాలు

* ఉత్సవాలకు అవసరం అయిన సరుకులకు ఆన్‌లైన్ షాపింగ్ ప్రక్రియకు ప్రోత్సాహం ఇవ్వాలి. అనవసర ప్రయాణాలను మానుకోవాలి

*పండుగ సంబరాలలో ఖచ్చితంగా భౌతికదూరాలు పాటించాలి. మాస్క్‌లు ధరించాలి. కొవిడ్ మార్గదర్శకాలను మరవవద్దు
కేసులు పెరుగుతున్న జిల్లాల్లో కంటైన్మెంట్ జోన్లలో గుంపుల వారిగా జనసమ్మేళనాలపై నిషేధం ఉండేలా చూడాలి
ప్రాంతాలవారిగా రాష్ట్రాలు ముందుగానే గైడ్‌లైన్స్ వెలువరించి ప్రజలకు తెలియచేయాలి

*ఇక అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తరువాత జరిగే ఉత్సవాలు వేడుకలపై సరైన నిఘా ఉంచాలి. పరిమిత సంఖ్యలో నిర్థిష్ట రీతిలోనే జనం వచ్చేలా చూడాల్సి ఉంటుంది.

*మాల్స్, స్థానిక మార్కెట్లు, అంగళ్లు, మండీలలో , ప్రార్థనా స్థలాల్లో కొవిడ్ నియమాలు ఖచ్చితంగా అమలు పర్చాలి
కొవిడ్ నియంత్రణ నిర్వహణల సంబంధిత అయిందంచెల టెస్టు ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్, భౌతికదూరాల పద్థతిని పాటించేలా చూడాలి

*కేసులలో ఉదృతి పరిణామాలను ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు పర్యవేక్షించాలి. నియంత్రించాలి. వ్యాప్తి తలెత్తకుండా చూసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News