హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం డిఒపిటిని పురమాయించి మరో అడుగువేయక ముందే రాష్ట్రానికి కొత్త డిజిపిని నియమించనున్నట్లు తెలిసింది. క్యాట్ తీర్పుపై తెలంగాణ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడంతో క్యాట్ తీర్పును కొట్టివేసిం ది. దీంతో కేంద్ర ప్రభుత్వం సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్‌ను ఆయన సొంత (ఆంధ్రప్రదేశ్) కేడర్‌కు రిపోర్టు చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు, డిఒపిటి ఉత్తర్వుల మేరకు ఆ రా ష్ట్ర సిఎస్ జవహర్‌రెడ్డిని సోమేశ్‌కుమార్ కలిసి జాయినింగ్ రిపోర్టు ఇవ్వనున్నారు. కేంద్రం తమకు కేటాయించిన రాష్ట్రాల్లో ఉండకుండా తమకు నచ్చి న రాష్ట్రాల్లో పనులు చేస్తున్న మరో 15మంది ఐఎఎస్, అధికారులపై తీర్పు ప్రభావం చూపనున్నది. ప్రస్తుతం ఇన్‌చార్జి డిజిపిగా ఉన్న అంజనీకుమార్ కూడా ఎపి క్యాడర్ ఐపిఎస్ అధికారి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం పునర్ ఆలోచనలో పడినట్లు తెలిసింది. అంజనీకుమార్‌ను తప్పించి..
రాష్ట్రానికి త్వరలో కొత్త డిజిపిని నియమించనున్నట్లు సమాచారం. కొత్త డిజిపిగా తెలంగాణా క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారిని సీనియారిటీ ప్రాతిపదికన నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సీనియారిటీపరంగా జాబితాలో అర్హులైన ఐపిఎస్ అధికారుల బయోడేటాను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రసుత్తం డిజిపి, అదనపు డిజిపి హోదాల్లో విధులు నిర్వహిస్తున్న వారితో పాటు.. సీనియర్ ఐపిఎస్ అధికారుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఐపిఎస్ అధికారుల్లో తెలంగాణ డిజిపి అంజనీకుమార్, అదనపు డిజి అభిలాష బిస్త్, అభిలాష్ మహంతి తెలంగాణలో పనిచేస్తుండగా,వారిని మొదట ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఎపిలో తెలంగాణ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారులు మనీష్‌కుమార్‌సింగ్,అమిత్ గార్గ్, అతుల్ సింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నారు. ఐఎఎస్ కేడర్ నుంచి సోమేశ్‌కుమార్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌కు మొదట కేటాయించిన వాణీప్రసాద్, వాకాటి కరుణ, రోనాల్ రోస్, ఎం.ప్రశాంతి, కె.ఆమ్రపాలి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు.
అదే విధంగా తెలంగాణ కేడర్ అధికారులు హరికిరణ్, సృజన, శివశంకర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. ఈ అధికారులను మాతృ కేడర్‌కు చెందిన రాష్ట్రానికి తరలించాలని కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేస్తుందో లేదో చూడాలి. కేంద్ర నిర్ణయంతో ఈ అధికారులు కూడా తమ రాష్ట్రానికి వెళ్లాల్సి ఉంటుంది. సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌కుమార్ నేడు (గురువారం) ఆంధ్రప్రదేశ్‌లో విధులలో చేరనున్నారు. మాతృ కేడర్ అయిన ఎపికి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. 1989 ఐఎఎస్ బ్యాచ్‌కు చెందిన సోమేశ్ కుమార్ 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించబడ్డారు. సోమేశ్‌కుమార్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) నుంచి క్లియరెన్స్ పొందడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు.