Sunday, December 22, 2024

కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానానికి ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

సైన్సు సిటీని అభివృద్ది చేయడమే తమ లక్ష్యం: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్:  దేశంలో నూతన విద్యావిధానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, సైంటిఫిక్ టెంపర్ పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని తార్నాకలోని సిఎస్‌ఐఆర్, ఐఐసిటిలో సైన్స్ సిటీ సెంటర్‌కు కేంద్ర మంత్రి సైన్స్, టెక్నాలజీ మంత్రి డాక్టర్. జితేంద్ర సింగ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అంతా ఎన్నికల వాతావరణంలో ఉంటే ప్రధాని మోడీ మాత్రం కేంద్ర మంత్రులతో అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసి వికసిత భారత్ గురించి చర్చించినట్లు వెల్లడించారు.

సైన్స్ సిటీ ఏర్పాటు ఆలస్యమైందనది తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న సెంటర్‌ను సైన్స్ సిటీగా డెవలప్ చేయాలనేది మా లక్ష్యమన్నారు. గత ప్రభుత్వానికి దీని కోసం భూమి కావాలని చాలా సార్లు లేఖ రాసిన ఇవ్వలేదని మండిపడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఐసిటిలో సైన్స్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన సర్కార్ భూమి ఇవ్వాలని అడుగుతున్నామని, ప్రభుత్వం ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు. పాఠశాలలో విద్యార్థులను సైన్స్ పట్ల ఆసక్తి కలిగేలా ప్రోత్సహించి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ దుర్వినియోగం కాకుండా చూడాలి సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News