Thursday, January 23, 2025

కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించాలి : లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: కేంద్ర ప్రభుత్వ పథ కాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారత సాధించాలని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సూ చించారు. పారదర్శకమైన పాలనతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రదాని మోడీకి అందరూ మ ద్దతు ఇవ్వాలన్నారు. ఎంపి డాక్టర్ లక్ష్మన్ జన్మదిన వే డుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సం దర్భంగా నల్లకుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పంచిన లక్ష్మణ్ రాంనగర్ గుండు వ ద్ద కార్యకర్తలు ఏర్పాటు చేసిన అన్నదాన కా ర్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం ఆయన మా ట్లాడుతూ పేదల సంక్షేమం. అభివృద్దే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పేదరిక నిర్మూ లనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రవాణా వ్య వస్థ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం భా రీగా నిధులు ఖర్చు చేస్తున్నామని వివరించారు. కేంద్ర పధకాలను అర్హులకు అందించేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. బిజెపి నియోజక వర్గ కన్వీనర్ రమేష్ రాం, డివిజన్ పార్టీ అధ్యక్షుడు నరేష్, రో య్యూరు శేషసాయి, సూర్యనారాయణ శర్మ, సా యి కృష్ణ యాదవ్, సుబ్రమణ్యం బాబు, కౌండిన్య ప్రసాద్, వెంకట్ రామ్‌రెడ్డి, కొత్తగుండ్ల రామారావు, దర్గా నర్సింగరావు, ప్రసాద్ గౌరీ శంకర్, శ్యామ్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News