Wednesday, January 22, 2025

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో తొమ్మిది సంవత్సరాల కాలంలో పేద ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బిజెపి కార్యకర్తలు ప్రతి బూత్‌స్థాయిలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు, భువనగిరి మాజీ ఎంపి డా. బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.

మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలో వైవిఆర్ ఫంక్షన్ హాల్ లో నకిరేకల్ అసెంబ్లీ స్థాయి మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా వివిధ సంయుక్త మోర్చాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బిజెపి బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సమిష్టి కృషి తో పని చేయాలన్నారు. ఈ నెల 21 న యోగా దినోత్సవాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రజలతో చేయాలన్నారు. జూన్ 22 న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యకర్తలందరూ బూత్‌స్థాయిలో ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని కోరారు. జూన్ 22 నుండి 30 వరకు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచాలన్నారు.

ఈ నెల చివరలో అసెంబ్లీ స్థాయిలో 5 వేల మందితో ఒక మినీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. నకిరేకల్ అసెంబ్లీ కన్వీనర్ మైల నర్సింహ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి, అసెంబ్లీ కన్వీనర్ మైల నర్సింహ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య, బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్, మండల ప్రధాన కార్యదర్శి కారంపూడి సాయికుమార్, కో కన్వీనర్ మాడూరి ప్రభాకర్ రావు, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి పజ్జూరి వెంకట్‌రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు నూకల సుధాకర్ రెడ్డి వివిధ మోర్చాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News