Friday, November 22, 2024

కొవిడ్‌పై నిర్లక్ష్యం కుదరదు

- Advertisement -
- Advertisement -

Union Home Ministry asks states allow relaxation of Covid-19

ప్రోటోకాల్స్‌తో నివారణ చర్యలు
రాష్ట్రాలు, యుటిలకు కేంద్రం లేఖలు
యూరప్ ఆసియా వైరస్‌పై జాగ్రత్తలు
వ్యాక్సిన్లు, ఐదంచెల పద్థతులు కీలకం

న్యూఢిల్లీ : కొవిడ్ పట్ల ఇప్పుడు నిర్లక్ష్యం పనికిరాదని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు వెలువరించింది. కరోనా ముగిసిందని అనుకోరాదని, ఇప్పుడు ఆసియా మరో వైపు యూరప్‌లలో తిరిగి వైరస్ విజృంభిస్తోన్న దశలో మునుపటి కట్టుబాట్లతోనే వ్యవహరించాల్సి ఉందని తెలిపింది. చైనా, ఆగ్నేయాసియా, యూరప్‌లోని కొన్ని దేశాలలో సరికొత్త వేరియంట్లతో వైరస్ పుంజుకుంది. పలు ప్రాంతాలలో లాక్‌డౌన్లు విధించారు. ఈ దశలో ఇంతకు ముందటిలాగానే ఇక్కడ భౌతికదూరాలు, మాస్క్‌ల ధారణ కీలకం అని, ఎక్కువ మంది గుమికూడటం వంటివి నివారించాల్సి ఉందన్నారు. అన్ని రాష్ట్రాలు ఈ దిశలో స్థానిక అధికార యంత్రాంగానికి తగు ఆదేశాలు వెలువరించాలి. ప్రజానీకం కట్టుబాట్లను పాటించేలా చూడాల్సి ఉందని తెలిపారు. పలు ప్రాంతాలలో భారీస్థాయిలో సామాజిక కార్యక్రమాలు, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం అయ్యాయి. ఈ దశలో వ్యాక్సిన్లకు తగు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పుడు మనమంతా అనివార్యంగా ఐదు అంచెల వ్యూహం టెస్టు ట్రాక్ ట్రీట్, కోవిడ్ నిబంధనలు, వ్యాక్సినేషన్‌లపై దృష్టి పెట్టాల్సి ఉందని సూచించారు.

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తరఫున రాష్ట్రాలకు , యుటిలకు సంబంధిత విషయంపై లేఖలు వెలువరించారు. సరికొత్త వేరియంట్లు తలెత్తుతున్నందున అనుమానితులకు తక్షణ పరీక్షలు అవసరం. వాటిని తగు రీతిలో ప్రయోగశాలలకు పంపించి, వ్యాప్తిని నివారించాల్సి ఉంటుంది. కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించడం ద్వారానే వైరస్‌ను కట్టుదిట్టంగా నివారించేందుకు వీలేర్పడుతుంది. ఇప్పటివరకూ వ్యాక్సిన్లు వేసుకోని వారిని గుర్తించాలి. అదనపు డోస్‌ల అవసరాన్ని ప్రజలకు తెలియచేయాల్సి ఉందని, అన్ని విధాలుగా ప్రజలను కొవిడ్ 19కు వ్యతిరేకంగా చైతన్యవంతులను చేయాల్సి ఉందన్నారు.శాంపుల్స్ సేకరణలు, వాటి పరీక్షలకు సంబంధించి ఇప్పటికే జాతీయ వ్యాధుల నివారణ కేంద్రం (ఎన్‌సిడిసి) అంటువ్యాధుల నివారణ బాధ్యతలలో ఉంటూ ప్రోటోకాల్స్‌ను పంపించింది. వీటిని రాష్ట్రాలు, యుటిలు పాటించాల్సి ఉంది. ఇన్‌సాకాగ్ నెట్‌వర్క్‌కు కీలక ఖరారిత కేంద్రాల ద్వారా శాంపుల్స్‌ను పంపించాల్సి ఉంటుంది.

దీని వల్ల ఇతర దేశాల నుంచి ఇక్కడికి తరలివచ్చే సరికొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించి, వీటి విరుగుడుకు అనుగుణంగా జాతీయ స్థాయి లో సరైన వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు వీలేర్పడుతుందని రాజేష్ తమ లేఖలలో తెలిపారు. కొత్త కేసుల సముదాయాలను గుర్తించాల్సి ఉంటుంది. నివారణ చర్యలను అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భారత్‌లో వ్యాక్సినేషన్ల సంఖ్య పెరగడం, ఇతర కారణాలతో ఇటీవలి కాలంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు రోజుకు 5వేలకు తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేయడం, అంతర్జాతీయ రాకపోకల నేపథ్యంలో వైరస్ తిరిగి వచ్చే ముప్పు ఉన్నందున ప్రజలు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ వెలువరించిన లేఖలలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News