Monday, December 23, 2024

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

- Advertisement -
- Advertisement -
  • కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి

ఇబ్రహీంపట్నం: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకపోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి కార్యకర్తలకు ఉదోదించారు. శుక్రవారం మండల కేంద్రంలోని వైష్ణవి గార్డెన్‌లో బిజెపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎన్ను యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన సంయుక్త మోర్చాల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ వచ్చే ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మోడీ చేస్తున్న సంక్షేమ పథకాల తోపాటు అనేక సబ్సిడీలు అందజేస్తున్న విషయం కార్యకర్తలు ప్రజలకు వివరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ నాయకులు తళ్లోజు ఆచారి, కొండా విశ్వేర్వరరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొక్కా నర్సింహ్మారెడ్డి, పోరెడ్డి నర్సింహ్మారెడ్డి, పోరెడ్డి అర్జున్‌రెడ్డి , కొత్త అశోక్‌గౌడ్ , ముత్యాల బాస్కర్, అంజయ్యయాదవ్, కొప్పు బాషా, నాయిని సత్యనారాయణ, జక్కా రవిందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం , ఆదిబట్ల బిజెపి అధ్యక్షులు దండె శ్రీశైలం, సిగ వీరస్వామిగౌడ్ , తాళ్ళ వెంకటేశ్‌గౌడ్, దయానంద్ , లక్ష్మిపతిగౌడ్ , మొగలి గనేష్ తదితరులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News