Sunday, November 24, 2024

కొవిడ్-19తో పెద్ద దిక్కును కోల్పోయిన వారికి పింఛన్ పథకం: కేంద్రం

- Advertisement -
- Advertisement -

Central Govt announced pension scheme for dependents of covid victims

సగటు వేతనంలో 90 శాతం పింఛన్‌గా..

న్యూఢిల్లీ: కుటుంబపోషకులుగా ఉంటూ కొవిడ్-19 వల్ల మృతి చెందితే, వారిపై ఆధారపడిన కుటుంబసభ్యుల(డిపెండెంట్స్) కోసం కొత్త పింఛన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది నుంచి రెండేళ్లపాటు కరోనా బారిన పడి మరణించినవారి కుటుంబసభ్యులకు ఈ పథకం వర్తిస్తుంది. ఉద్యోగుల బీమా పథకాన్ని(ఇడిఎల్‌ఐ) కూడా వారికి వర్తింపజేయనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం(పిఎంఒ) ఓ ప్రకటనలో తెలిపింది. కొవిడ్19 వల్ల మృతి చెందిన కార్మికులు పొందిన సగటు వేతనంలో 90 శాతాన్ని పింఛన్‌గా ఇవ్వనున్నట్టు పేర్కొన్నది. కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు ఇడిఎల్‌ఐ పథకం వర్తిస్తుందని తెలిపింది. ఈ ప్రయోజనాలు 2020 మార్చి 24 నుంచి 2022 మార్చి 24 వరకు మృతి చెందినవారి కుటుంబసభ్యులకు వర్తిస్తాయి. ఈ పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలను కార్మిక మంత్రిత్వశాఖ జారీ చేస్తుందని పిఎంఒ తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News