Friday, February 21, 2025

రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉండే రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అన్నదాతల పెట్టుబడుల సహాయార్ధం ఇచ్చే పిఎం కిసాన్ పథకం 19వ విడత విడుదల తేదీని కేంద్రం ప్రకటించింది. బిహార్‌లోని భాగల్పూర్‌లో ఈ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేస్తారు. తద్వారా ఇందులో నమోదు చేసుకున్న ప్రతి రైతు ఖాతాలో రూ.2వేలు జమా కానున్నాయి.

ఈ పథకం దార్వా 9.7 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు. ఈ నిధులను అందుకోవాలంటే.. ఇ-కెవైసి పూర్తి చేసి.. ఎన్‌పిసిఐ, ఆధార్‌తో అనుసంధానించిన బ్యాంకు ఖాతా ఉండటం తప్పనిసరి. పిఎం కిసాన్ వెబ్‌సైట్‌లో తమ స్టేటస్ కానీ, రైతుల పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చని అన్నారు. అంతేకాక.. పిఎం కిసాన్ యాప్‌ కూడా అందులో ఉందని పేర్కొన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News