Monday, December 23, 2024

రాష్ట్రంలో రూ.83,543కోట్ల రైల్వే ప్రాజెక్టులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మైదాన ప్రాం తాల్లో అతి తక్కువ రైల్వే నెట్‌వర్క్ తెలంగాణ రా ష్ట్రంలో ఉందని.. అందుకు అనుగుణంగా భారీ గా విస్తరించేందుకు పలు ప్రాజెక్టు చేపడుతున్నామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్రం చేపట్టే రైల్వేల అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ 75 ఏళ్లలో తెలంగాణలో రైల్వేవ్యవస్థను అభివృద్ధి చేసే ప్రయత్నం చిత్తశుద్ధితో, పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. ప్రధాని నరేంద్ర మో డి ప్రభుత్వం తెలంగాణలో రహదారులకు సం బంధించి మౌలికవసతులకు పెద్దపీట వేస్తూనే.. రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించడంతోపాటుగా.. వెంటవెంటనే ప్రా జెక్టులను పూర్తిచేసేందుకు సంపూర్ణంగా కృషి చేస్తోందన్నారు. 2022లో రాష్ట్ర ప్రభుత్వం, ని ర్లక్ష్యం సహాయ నిరాకరణ కారణంగా.. దాదాపు 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ సహకారం, తమవంతు వాటా నిధులు, భూసేకరణలో పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనుకడుగు వేయడం లేదు.

ఏడాదికి 55 కిలోమీటర్ల లైన్ల నిర్మాణం
2014కు ముందు ఏడాదికి 17.4 కిలోమీటర్ల రైల్వేలైన్ల నిర్మాణం జరిగాయి. ప్రధాని మోడీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏడాదికి 55 కిలోమీటర్ల రైల్ లైన్ల నిర్మాణం జరుగుతోందని కేం ద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 40 స్టేషన్ల ఆధునీకరణ, అభివృద్ధికి కేంద్రం రూ. 2,300 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇటీవలే 21 స్టేషన్లకు ప్రధాని వర్చువల్ విధానంలో శం కుస్థాపన చేశారని గుర్తుచేశారు. రూ. 4,686 కోట్లతో ముద్-ఖేడ్ – మేడ్చల్ మధ్య.. మహబూబ్‌నగర్ – డోన్ మధ్య రూ. 2,854 కోట్లతో గుంటూ రు – బీబీనగర్ మధ్య చేపట్టే ప్రాజెక్టులకు ఇప్పటి కే నిధులు మంజూరయ్యాయి. రాష్ట్రంలో ఫైనల్ లొకేషన్ సర్వేలో 15 కొత్త ప్రాజెక్టులు, 15 అదనపు లైన్ల ప్రాజెక్టులు మొత్తం 30 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్నదని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ మొత్తం ప్యాకేజీ విలువ రూ. 83,543 కోట్లు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. వీ టితో పాటు 8 డబ్లింగ్, 3 ట్రిప్లింగ్ల్, 4 క్వాడ్రప్లిం గ్ లైన్లకు పచ్చజెండా ఊపిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News