Monday, December 23, 2024

యూరియాపై సబ్సిడీ 2025వరకూ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బుధవారం నాటి కేంద్ర మంత్రి మండలి భేటీలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతుల పంటలకు వాడే యూరియాపై మొత్తం మీద ఇచ్చే ఇప్పటి రూ 3.68 లక్షల కోట్ల సబ్సిడీని 2025 మార్చి వరకూ కొనసాగించే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. నేల సారం పరిరక్షణకు, గంధక లోపం నివారణకు ఉద్ధేశించిన సల్ఫర్ మిళిత యూరియా (యూరియా గోల్డ్)ను దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి కూడా సమ్మతి దక్కింది. ఈసారి సేంద్రీయ ఎరువు ప్రోత్సాహ దిశలో రూ 1,451 కోట్ల మేర ఇటువంటి ఎరువులకు సబ్సిడీ ఇవ్వాలని కూడా సంకల్పించారు. దీనితో మొత్తం సబ్సిడీల ప్యాకేజ్ విలువ రూ 3.70 లక్షల కోట్లు దాటుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News