ఢిల్లీ మెట్రో ఫేస్ 4 ప్రాజెక్టుకు చెందిన రెండు కొత్త కారిడార్లకు కేంద్ర క్యాబినెట్ బుధవారం పచ్చ జెండా ఊపింది. ఢిల్లీ మెట్రోలోని ఫేస్ 4 ప్రాజెక్టుకు చెందిన కొత్త కారిడార్లు లజ్‌పత్ నగర్ నుంచి సాకేత్ జి బ్లాక్‌కు, ఇంద్రలోక్ నుంచి ఇంద్రప్రస్థకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ రెండు కారిడార్ల మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 8,399 కోట్లు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నిధులను సమకూరుస్తాయని ఆయన తెలిపారు. ఈ రెండు లైన్ల పొడవు 20.762 కిలోమీటర్లని ఆయన చెప్పారు. ఇంద్రలోక్–ఇంద్రప్రస్థ కారిడార్ గ్రీన్ లైన్ విస్తరణ కిందకు వస్తుంది. రెడ్, ఎల్లో, ఎయిర్‌పోర్ట్ లైన్, మెజెంటా, వైలెట్, బ్లూ లైన్లతో ఇంటర్‌చేంజ్ ఉంటుంది. ఇక లజ్‌పత్ నగర్-సాకేత్ జి బ్లాక్ కారిడార్ సిల్వర్, మెజెంటా, పింక్, వైలెట్ లైన్లను కలుపుతుంది.
ఢిల్లీ మెట్రో ఫేస్ 4లో 2 కొత్త కారిడార్లకు పచ్చజెండా
- Advertisement -
- Advertisement -
- Advertisement -