Wednesday, January 22, 2025

విద్యుత్ ఉత్పత్తిపై రాష్ట్రాల పన్ను అనుచితం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విద్యుత్ ఉత్పాదనపై ఎటువంటి పన్నులు, సుంకాలు విధించరాదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. బొగ్గు, నీరు, గాలి లేదా సౌర ఈ విధంగా ఏ వనరుల ద్వారా విద్యుత్ ఉత్పాదన జరిగినా సంబంధిత ప్రాజెక్టులపై కేంద్రాలపై పన్నులు లేదా సుంకాలు విధించే అధికారం కేంద్రానికి లేదని కేంద్రం తెలిపింది. ఒకవేళ పన్ను విధిస్తే అది అక్రమం, చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని కేంద్ర ప్రభుత్వం తరఫున విద్యుత్ మంత్రిత్వశాఖ ఈ నెల 25వ తేదీన సర్కులర్ పంపించింది.

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ఉత్పత్తిపై అదనపు సుంకాలు విధిస్తున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు నోటీసులు వెలువరిస్తున్నట్లు తెలిపారు. డెవలప్‌మెంట్ ఫీ లేదా ఛార్జిలు ఫండ్‌ల పేరిట వసూళ్లకు దిగుతున్నారని ఇది మానుకోవల్సి ఉందని సర్కులర్‌లో పేర్కొన్నారు. హైడ్రో విండ్, సోలార్ లేదా న్యూక్లియర్ ఈవిధంగా ఎటువంటి వనరుల ద్వారా విద్యుత్ ఉత్పాదన జరిగినా దీనిపై అదనపు భారాలు విధించే అధికారం , హక్కు రాష్ట్రాలకు లేదని ప్రకటనలో తెలిపారు. పన్నులు సుంకాల విధింపు అధికారాలు రాజ్యాంగంలోని షెడ్యూల్‌లో కూడా పొందుపర్చినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News