Friday, November 15, 2024

‘డార్క్ పాటర్న్’ పై కేంద్రం నిషేధం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆన్‌లైన్ షాపింగే. ఎలక్ట్రానిక్ వస్తువులనుంచి నిత్యావసర వస్తువులదాకా అన్నీ ఆన్‌లైన్ లో ఆర్డర్ చేయడమే జరుగుతోంది. దీంతో ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌ల మధ్య పోటీ పెరిగిపోయింది. ఈ క్రమంలో కొన్ని వెబ్‌సైట్లు కస్టమర్లను ఆకట్టుకోవడంతో పాటుగా వారితో బలవంతంగా షాపింగ్ చేయించడానికి కొన్ని ట్రిక్స్ ప్రయోగిస్తున్నాయి. అయితే ఇకపై ఈ ట్రిక్కులు పని చేయవు. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్రప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఇలాంటి ‘డార్క్ పాటర్న్’ ఉపయోగించకుండా వాటిపై నిషేధం విధించింది. ఈ మేరకు ‘ గైడ్‌లైన్స్ ఫర్ ప్రివెన్షన్ అండ్ రెగ్యులేఫన్ ఆఫ్ డార్క్ పాటర్న్’ పేరుతో కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థ( సిసిపిఎ) ఒక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

దేశంలో వస్తుసేవలను అందించే అన్ని ఇకామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది.‘ డార్క్ పాటర్న్’ ఉపయోగించడమంటే కొనుగోలుకు ఉన్న స్వేచ్ఛాయుత అవకాశాలను మార్చి కస్టమర్లను తప్పుదోవ పట్టించడమే. ఇది అక్రమమైన వాణిజ్య విధానం. వినియోగదారులకున్న హక్కులను ఉల్లంఘించడమే. ఇకపై ఈ పద్ధతులను అవలంబిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. జరిమానాలు విధిస్తాం’ అని సిసిపిఎ ఆ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ‘డార్క్ పాటర్న్’ అంటే ఏదైనా ప్లాట్‌ఫామ్‌లో యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మార్చడం లేదా, యూజర్ రివ్యూలను ఉపయోగించి మోసపూరిత డిజైన్ పాటర్న్‌ను రూపొందించడం. వినియోగదారులను తప్పుదారి పట్టించడం, లేదా వారిని మోసగించడానికి ఈ డార్క్‌పాటర్న్‌లు ఉపయోగపడతాయి. వినియోగదారులను ప్రభావితం చేసి వారిని గందరగోళానికి గురి చేయడం, బలవంతంగా షాపింగ్ చేయడమే దీని లక్షం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News