Sunday, December 22, 2024

కశ్మీర్‌లో ముస్లింలీగ్ మస్రత్ పై నిషేధం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : ముస్లిం లీగ్ జమ్మూకశ్మీర్ మస్రత్ ఆలం ఫ్యాక్షన్ (ఎంఎల్‌జెకెఎంఎ)ను బుధవారం నిషేధించారు. ఈ సంస్థ తన విద్వేష ప్రచారంతో ఇస్లామిక్ పాలనను తీసుకువచ్చేందుకు యత్నిస్తోందని అభియోగాలు వెలువడ్డాయి. దీనితో అన్ని పూర్వాపరాలను పరిగణనలోకి తీసుకుని ఈ సంస్థను నిషేధిస్తున్నట్లు అధికార యంత్రాంగం బుధవారం తెలిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి కూడా సంబంధిత ప్రకటన వెలువడింది. మస్రత్ ఆలం వర్గం కావాలనే దుష్ప్రచారానికి దిగుతోంది.

ఇది తమ దృష్టికి వచ్చిందని, దీనితో ఈ సంస్థపై వేటు వేస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. ఈ సంస్థకు మసరత్ ఆలం భట్ సారధ్యం వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఈ సంస్థ తరచూ పాకిస్థాన్ అనుకూల, భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలు వచ్చాయి. చివరికి జమ్మూ కశ్మీర్‌ను భారత్ నుంచి విడగొట్టాలనే లక్షంతో వీరు పనిచేస్తున్నట్లు, ఇటువంటి కవ్పింపు చర్యలను ఆదిలోనే అంతం చేసేందుకు ఈ చర్యకు దిగుతున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News