Saturday, January 4, 2025

మన్మోహన్ సింగ్ స్మారక కేంద్రం స్థలం గుర్తింపు ప్రక్రియ

- Advertisement -
- Advertisement -

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు స్మారక కేంద్రం ఏర్పాటు కోసం స్థలం గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. స్థలం ఖరారు నిమిత్తం ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం సంప్రదిస్తోంది. రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో సంజయ్ గాంధీ స్మారక కేంద్రం చుట్టుపక్కల స్థలాలను కేంద్ర పబ్లిక్ వర్క్ శాఖ (సిపిడబ్లుడి) అధికారులు సందర్శించారని, స్మారక కేంద్రం ఏర్పాటు నిమిత్తం కొన్ని ప్రదేశాలు గుర్తించారని అధికార వర్గాలు తెలియజేశాయి.

ప్రభుత్వం మాజీ ప్రధాని కుటుంబాన్ని సంప్రదిప్తోందని, స్మారక కేంద్రం స్థలం కోసం మూడు నాలుగు ఆప్షన్‌లపై చర్చించిందని ఆ వర్గాలు తెలిపాయి. ఇంత వరకు ఏ స్థలాన్ని ఖరారు చేయలేదని, సింగ్ కుటుంబాన్ని సంప్రదించిన మీదటే అంతాజరుగుతుందని ఆ వర్గాలు వివరించాయి. స్మారక కేంద్రం కోసం ఎంపిక చేసిన స్థలాన్ని కేటాయించే ముందు కేంద్రం ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తుంది. స్మారక కేంద్రం ఏర్పాటుకు తన సుముఖతను ప్రభుత్వం ఇప్పటికే మాజీ ప్రధాని కుటుంబానికి తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News