హైదరాబాద్:ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో ఐదవసారి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్ లో భాగంగా తెలంగాణ లోని సింగరేణికి రూ. 1,650 కోట్లు కేటాయించగా, ఐఐటి హైదరాబాద్ కు ఈఏపి కింద రూ. 300 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. తెలుగు రాష్ట్రాల గిరిజన వర్సిటీలకు రూ. 37 కోట్లు కేటాయించింది. కేంద్ర పన్నుల్లో తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లు కేటాయించగా, కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41,338 కోట్లు కేటాయించారు.
దేశంలోని 22 ఎయిమ్స్ ఆసుపత్రులకు రూ. 6,835 కోట్లు నిధులు మంజూరు చేయగా, బిబినగర్ , ఎపిలోని మంగళగిరి ఎయిమ్స్ లకూ కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియంతో సహా అని మ్యూజియాలకు రూ. 357 కోట్లు నిధులు మంజూరు చేయగా, మణుగూరు కోట భరజాల కర్మాగారాలకు రూ.1,473 కోట్లు ,విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ. 683 కోట్లు కేటాయించారు.