Sunday, December 22, 2024

అప్పులపై హాట్‌హాట్ చర్చ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలు, పాలనాపరమైన పద్దతులు, రాజకీయ విధానాల మూలంగా దేశంలోని ఏకంగా 23 రాష్ట్రాలు ఆర్ధిక ఇబ్బందుల్లోకి, అప్పుల ఊబిలోకి నెట్టివేయబడ్డాయనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖ పెద్దలు మాత్రం జరిగిన డ్యా మేజ్‌ను సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సమయం మించిపోయిందని, ఇప్పటికే సుమారు పది రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయ ని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. రాష్ట్రాలు ఆర్ధికంగా నష్టపోవడానికి, అప్పుల ఊబి లో కూరుకుపోవడానికి దారితీసిన అంశాలపై ఈ నెల 6వ తేదీన ముంబాయిలోని ఆర్‌బిఐ కేంద్ర కా ర్యాలయంలో జరిగిన అన్ని రాష్ట్రాల ఆర్ధికశాఖల కార్యదర్శుల 33వ సమావేశం హాట్‌హాట్‌గా సాగి ందని తెలిసింది.

రాష్ట్రాలు చేసిన అప్పులు, కార్పోరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గ్యారెంటీలు పె నుభారంగా మారాయని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేసినట్లు గా నటించారని, రాష్ట్రాల అప్పులపై కేంద్ర ప్రభు త్వ ఆర్ధికశాఖాధికారులు కపట ప్రేమను ప్రదర్శించారేగానీ అందుకు దారితీసిన పరిణామాలను మాత్రం చర్చించడానికి అవకాశాలు ఇవ్వలేదని ప లు రాష్ట్రాల ఆర్ధికశాఖ కార్యదర్శులు అసంతృప్తిని వ్యక్తంచేసినట్లు తెలిసింది. అంతేగాక సమావేశం మొత్తంలో రాష్ట్రాల అప్పులపైనే మాట్లాడిన కేంద్ర ఆర్ధికశాఖ కార్యదర్శులు కేంద్రం ప్రభుత్వం చేసిన అప్పులు, ఆ నిధులను ఖర్చు చేసిన విధానాలపైన ఒక్క మాట కూడా మాట్లాడలేదని, కనీసం రాష్ట్రాల అభిప్రాయాలను కూడా తీసుకోలేదని కొందరు సీనియర్ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. గడచిన తొమ్మిదేళ్ళల్లో కేంద్ర ప్రభుత్వం సుమారు 95 లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసిందని తెలిపారు.

ప్రస్తుతం కేంద్రం అప్పులు 155.8 లక్షల కోట్లకు పెరిగాయని ఇటీవల కేంద్ర ఆర్ధికశాఖామంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా తెలిపారని, అంటే దేశ జిడిపిలో 57.3 శాతం వర కూ అప్పులున్నాయని, కానీ ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 40 శాతానికి లోబడి మాత్రమే అప్పులు చేయాల్సి ఉందని, కానీ కేం ద్రం యధేచ్ఛగా అప్పులు చేసిందని వివరించారు. పోనీ చేసిన అప్పుల నిధులను ఉత్పత్తి రంగాలు, అభివృద్ధి పథకాలు (క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్)కు ఖర్చు చేసినట్లయితే దేశంలో ఎకనమిక్ యాక్టివిటీ జరిగి ఉండేదని, రాష్ట్రాలు కూడా ఆర్ధికంగా నిలదొక్కుకునేవని పేర్కొన్నారు. కానీ అలా చేయకుండా అనుత్పాదక రంగాలపైన లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం మూలంగా అభివృద్ధి లేకుం డా, ఎకనమిక్ యాక్టివిటీ లేక, సంక్షేమ రంగాలు, సేవా రంగాలపైన కూడా ఖర్చు చేయకపోవడంతో ప్రజల కొనుగోలుశక్తి పూర్తిగా పడిపోయిందని ఆ వేదన వ్యక్తంచేశారు. ఒకవైపు అప్పులు పెరిగాయేగానీ ఆ మేరకు దేశ ప్రజల ఆర్ధిక స్థితిగతులు మె రుగుపడలేదని,

ఈ విషయాన్నే సమావేశంలో చె ప్పడానికి చాలా రాష్ట్రాల ఆర్ధికశాఖల కార్యదర్శు లు విశ్వప్రయత్నాలు చేశారని, కానీ కేంద్రం నుం చి వచ్చిన అధికారులు మాత్రం మాట దూరనీయలేదని పేర్కొన్నారు. ఇలా వన్‌సైడ్‌గా సమావేశం జరిగిందని, ఏకపక్షంగా జరిగే సమావేశాల మూ లంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో అర్ధంచేసుకోవాలని కోరుతున్నారు. ఈ సమావేశానికి 23 రాష్ట్రాల నుంచి ఆర్ధికశాఖల కార్యదర్శులు, ఒక కేంద్రపాలిత ప్రాంత కార్యదర్శి హాజరయ్యారని, అంతేగాక కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి-కాగ్), ఎక్కౌంటెంట్ జనరల్, రిజర్వు బ్యాంక్ గవర్నర్, ఆర్‌బిఐ ఉన్నతాధికారులు… ఇలా ఒక్కరేమిటీ దేశ ఆర్ధికవ్యవస్థలోని అత్యంత కీలకమైన ఉన్నతాధికారులు, ఆర్ధిక మేధావులు, నిపుణులు పాల్గొన్నారని వివరించారు.
కానీ ఎందరు పాల్గొన్నా ఈ సమావేశం ఎలాంటి సత్పలితాలను సా ధించలేదని, రాష్ట్రాలను ఆర్ధికంగా గట్టెంక్కించే మార్గాలను కనుగొనలేకపోయిందని, అంతేగాక కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుల ఊబిలో నుంచి బయటపడేందుకు ఎలాంటి పరిష్కారమార్గాలను కనుగొనలేదని తెలిపారు.

కేవలం అప్పులపైన జాగ్రత్తగా ఉండాలని, కార్పోరేషన్లు, ఇతర సంస్థలను రాష్ట్రాలు ఇచ్చే గ్యారెంటీలు తగ్గించుకోవాలని మాత్రమే ఆదేశాలు, హితబోధలు చేశారే దేశ ఆర్ధిక వ్యవస్థను బాగుపరిచే ఎలాంటి విధానపరమైన నిర్ణయాలుగానీ, మార్గదర్శకాలను కూడా తీసుకోలేదని కొందరు అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ అప్పులు ఆర్ధిక సంవత్సరం ముగిసే 2024 మార్చి 31వ తేదీ నాటికి ఏకంగా 169 లక్షల కోట్లకు పెరుగుతాయని, కనీసం దీనికి కూడా ఈ సమావేశంలో ఎలాంటి పరిష్కారమార్గాలను కనుగొనలేదని, కేవలం రాష్ట్రాల అప్పులపైనే ఆంక్షలు విధించడానికి, ఇంకా చెప్పాలంటే మొక్కుబడిగా సమావేశాన్ని జరిపించి పంపించారని మరికొందరు అధికారులు అసంతృప్తిని వ్యక్తంచేశారు. అయితే మెజారిటీ రాష్ట్రాల అధికారులు సమావేశ మందిరంలో కాకుండా వ్యక్తిగతంగా తమతమ అభిప్రాయాలను కేంద్ర ఆర్ధికశాఖ అధికారులకు తెలియజేశారని తెలిపారు. అంతేగాక బిజెపి పాలిత రాష్ట్రాలన్నీ ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని ఉ ల్లంఘించి ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేశాయని, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ, రాజస్థాన్ వంటి బిజెపియేతర రాష్ట్రాలు కూడా పీకల్లోతుల్లో అప్పులు చేశాయని,

ఈ రాష్ట్రాలన్నీ జిఎస్‌డిపిలో అప్పులు సగటున 35 శాతానికి మించిపోయాయని, కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రమే 25.7 శాతానికి పరిమితమయ్యింద ని వివరించారు. తెలంగాణ రాష్ట్ర అప్పుల శాతాలు ఇంకా తగ్గుతాయని ఆ అధికారులు అంచనా వేశా రు. కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులతో దేశంలోని 142 కోట్ల మంది జనాభాలో ఒక్కొక్కరి తలపైన 1.50 లక్షల రూపాయల అప్పుల భారాన్ని మోపారని ఆ అధికారులు వివరించారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర అప్పులు జిఎస్‌డిపిలో కేవలం 25.7 శాతానికి పరిమితమయ్యాయని, కానీ కొత్త గా అప్పులు తెచ్చుకోవడానికి అనుమతులు కూడా ఇవ్వకుండా కేంద్రం తెలంగాణలో అభివృద్ధికి మోకాలడ్డుతోందని ఈ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయని ఆ అధికారులు వివరించారు. ప్రతి నెలా ఇ బ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్న పంజాబ్ రాష్ట్ర అప్పులు జిఎస్‌డిపిలో రికార్డుస్థాయిలో 53.3 శాతం ఉన్నాయని, అప్పుల్లో ఈ రాష్ట్రమే అగ్రస్థానంలో కొనసాగుతోందని, అయినప్పటికీ ప్రతినెలా రుణాల సేకరణకు కేంద్రం అనుమతులు ఇ స్తూనే ఉందని వివరించారు.

అదేవిధంగా అప్పుల్లో రాజస్థాన్ రాష్ట్రం 39.8 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతుండగా 38.8 శాతం అప్పులతో పశ్చి మ బెంగాల్ మూడో స్థానంలో ఉందని కేంద్ర ప్ర భుత్వ నివేదికలే స్పష్టంచేస్తున్నాయని వివరించా రు. కేరళ రాష్ట్రం అప్పులు 38.3 ఉండగా పొరుగు న ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఆ రాష్ట్ర జిఎస్‌డిపిలో 37.6 శాతం వరకూ ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ ఏపీకి కేంద్ర ప్రభుత్వ పెద్దల అండదండలున్నందున కొత్తకొత్త అప్పులకు యధేచ్ఛగా అనుమతులు లభిస్తున్నాయని వివరించారు. ఇలా కేంద్ర ప్రభుత్వమే కాకుండా కేంద్రం అండదండలున్న కొన్ని రాష్ట్రాలు కూడా నిరాఘాటంగా ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఆ అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News