Monday, January 20, 2025

ఆగస్టు 23 జాతీయ అంతరిక్ష దినం …

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆగస్టు 23వ తేదీ ఇకపై జాతీయ అంతరిక్ష దినంగా పాటిస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ వెలువరించింది. చంద్రయాన్ 3 చంద్రుడిపై సాఫ్ట్‌ల్యాండింగ్ జరిగి, ఇస్రో అంతరిక్ష ప్రయోగాలను కీలక మలుపు తిప్పిన రోజు ఆగస్టు 23 వ తేదీ.ఈ రోజును పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ తేదీన నేషనల్ స్పేస్ డే నిర్వహించడం జరుగుతుందని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అంతరిక్ష విభాగం వెలువరించిన నోటిఫికేషన్‌లో తెలిపారు. ఇటువంటి ప్రయోగాలు మరింత స్ఫూర్తిదాయకం అయ్యేలా చేసేందుకు, చంద్రుడి వద్దకు ప్రయోగం చిరస్మరణీయం చేసేందుకు ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినంగా పాటించడం జరుగుతుందని ఆగస్టు 26వ తేదీన ఇస్రో ప్రధాన కార్యాలయానికి వెళ్లినప్పుడు ప్రధాని మోడీ ప్రకటించారు. ఇప్పుడు నోటిఫికేషన్ వెలువడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News