Thursday, January 23, 2025

అజయ్ భల్లా పదవీకాలం మరో ఏడాది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పర్సనల్ మంత్రిత్వశాఖ ద్వారా ప్రకటన వెలువరించింది. ఇప్పుడు ఆయన పదవీకాలం పొడిగింపుతో 2024 ఆగస్టు 22వ తేదీ వరకూ హోంశాఖ కార్యదర్శిగా ఆయనే ఉంటారు. ఆయన పదవి పొడిగింపు ఇది నాలుగోసారి. 1984 ఐఎఎస్ బ్యాచ్ అధికారి అయిన భల్లా అసోం మేఘాలయా కేడర్‌కు చెందిన వారు. 2019 ఆగస్టులో ఆయన ఈ పదవిలో నియుక్తులు అయ్యారు. 60 సంవత్సరాలు పూర్తి కావడంతో ఆయన 2020 నవంబర్‌లో రిటైర్ కావల్సి ఉంది. అయితే వరుసగా ఈ కీలక పదవిలో ఆయన కొనసాగింపులు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News