Sunday, December 22, 2024

పోలవరానికి రూ.5036కోట్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ : గోదావరి నదిపై ఏపిలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేసేందకు ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ , కేంద్ర జలసంఘం సిఫార్సుల మేరకు కేంద్రప్రభుత్వం రూ.5036కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పనులపై ఏపి ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1948కోట్లు కేంద్రం తిరిగి ఎపికి చెల్లించనుంది. అంతే కాకుండా వచ్చే ఏడాది మార్చి వరకూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా భూసేకరణ, పునరావాస ప్యాకేజిలకు నిధుల చెల్లింపులకు కూడా అడ్వాన్స్‌గా రూ.3087కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఈ మేరకు నిధుల విడుదలకు సబంధించి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు నోట్‌ఫైల్ పంపారని, వారం రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని ఏపి జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శషిభూషన్ కుమార్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News