టీకా ప్రక్రియ వేగవంతానికి కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో టీకాల సిరంజీల ఎగుమతులపై మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించింది. మూడు రకాల సిరంజీల ఎగుమతులపై పరిమితులు విధించినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శనివారం ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశయ సాధనలో భాగంగా దేశంలో అర్హులందరికీ వ్యాక్సిన్ అందిస్తామన్న హామీ నెరవేర్చేందుకు సిరంజీల లభ్యతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ సమయంలో టీకా ప్రక్రియ పూర్తి చేయాలన్నదే ఈ కార్యక్రమం లక్షం. 0.5 ఎంఎల్ /1 ఎంఎల్‌ఆటో డిసేబుల్ , -0.5 ఎంఎల్ /1 ఎంఎల్ /2 ఎంఎల్ 73 ఎంఎల్ డిస్పోసబుల్ 4 ఎంఎల్ ఆటో డిసేబుల్ ,0.5 ఎంఎల్ / 1 ఎంఎల్ /2 ఎంఎల్ .3 ఎంఎల్ డిస్పోసబుల్ ,1 ఎంఎల్ 2,ఎంఎల్ 3 ఎంఎల్ 5 యూజ్ ప్రివెన్షన్ సిరంజీలపై ఈ పరిమితులు కొనసాగుతాయని చెప్పింది. మరోవైపు శనివారం మధ్యాహ్నం నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 94 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు. ఇందులో 67.80 కోట్లకు పైగా మొదటి డోసులు కాగా, 26.26 కోట్లకు పైగా 26.26 కోట్ల మందికి రెండు డోసులూ పూర్తయ్యాయి. దసరా (అక్టోబర్ 15) లోపే వంద కోట్ల మార్క్‌ను అందుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం.