- Advertisement -
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వోద్యోగుల కరువు భత్యం (డిఎ)ను కేంద్ర ప్రభుత్వం పెంచింది. 6వ కేంద్ర వేతన సంఘం, 5వ వేతన సంఘాల నిర్ధేశిత ముందస్తు సవరిత పే స్కేలు లేదా గ్రేడ్ పేలకు అనుగుణంగా వేతనాలు అందుకునే వారికి ఈ డిఎ పెంపుదల ఉంటుంది. ఈ ఏడాది జులై 1 నుంచి ఈ సవరించిన డిఎ అమలులోకి వస్తుందని ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని వ్యయవిషయాల విభాగం (డిఒఇ) ఇటీవల తన అధికారిక అంతర్గత సమాచారంతో తెలిపింది. దీని మేరకు బేసిక్ పేలో6వ వేతన సంఘం పరిధిలోని వారికి డిఎ ఇప్పుడున్న 203 శాతం నుంచి 212 శాతానికి చేరుతుంది. డిఎ పెంపుదల నిర్ణయంతో దాదాపు అరకోటి మంది ప్రభుత్వోద్యోగులకు మొత్తం మీద 15 శాతం డిఎ పెరుగుదల ఉంటుంది. దీపావళి నేపథ్యంలో డిఎ పెంపుదల నిర్ణయాన్ని ముందుగా ప్రకటించారు. 5వ వేతన సంఘం సిఫార్సుల పరిధిలోకి వచ్చే వారికి డిఎ 381 శాతం నుంచి 396 శాతానికి చేరుకుంటుంది.
- Advertisement -