Monday, January 20, 2025

జెఎన్.1 కొవిడ్ వేరియంట్ నిపుణుల హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో హఠాత్తుగా జెఎన్-1 కొవిడ్ వేరియంట్‌కు సంబంధించి 21 కేసులు నమోదు కావడం ఎటువంటి ఆశ్చర్యాన్ని కాని ఆందోళనను కాని కలిగించడం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రజలు కూడా ఎటువంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదని, అయితే కొవిడ్-19 సమయంలో తీసుకున్న ముందు జా్ర్గగత్తలనే పాటించాలని వారు సలహా ఇచ్చారు. మూడు రాష్ట్రాలలో కొత్త సబ్ వేరియంట్‌కు చెందిన కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన ప్రకటనతో ప్రజలు అప్రమత్తమయ్యారు. కాగా 594 కరోనావైరస్ కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. బుధవారం నమోదైన 614 కేసులతో పోలిస్తే ఈ సంఖ్య స్వల్పంగా తక్కువ. అయితే మే 21వ తేదీ తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మళ్లీ దేశంలో కొవిడ్ కేసులు పెరిగిపోతుండడంతో ప్రజలలో భయాందోళన ఏర్పడింది. అయితే నిపుణులు మాత్రం ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని, అందుబాటులో ఉన్న వైద్య చికిత్సలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఇన్ఫెక్షన్ చాలా స్వల్పంగా ఉందని, అన్ని వైరస్‌లు తొందరగానే క్షీణిస్తాయని నిపుణులు చెప్పారు.

శ్వాసకోశ సంబంధిత వైరస్‌ల విషయానికి వస్తే చాలా వైరస్‌లలో మార్పులు జరుగుతుంటాయని, సార్స్ కొవి-2లో సబ్ వేరియంట్ కనిపించడం ఆశ్చర్యమేమీ కాదని సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్, ప్రజారోగ్య నిపుణుడు డాక్టర్ చంద్రకాంత్ లహరియ అన్నారు. సార్స్ కొవి-2 వైరస్ అన్ని వౌరస్‌లలో సర్కులేట్ అవుతుందని ఆయన చెప్పారు. అధికార వర్గాల కథనం ప్రకారం జెఎన్-1కు చెందిన 19 కేసులు గోవాలో, ఒక్కో కేసు చొప్పున కేరళ, మహారాష్ట్రలో నమోదయ్యాయి. గత రెండు వారాలలో కొవిడ్—19కి సంబంధించి 19 మరణాలు సంభవించాయి. అయితే బాధితులు వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. ఇలా ఉండగా బిఎ2.86 వేరియంట్ నుంచి ప్రత్యేక వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్(విఓఐ)గా జెఎన్.1ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్‌క్ష) గత మంగళవారం గుర్తించింది. వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్‌కు చెందిన వైరస్‌లు జన్యుపరమైన మార్పులతో, అధిక సంక్రమణ, వ్యాక్సిన్లను తట్టుకునే లక్షణాలు కలిగి ఉంటాయని డబ్లుహెచ్‌ఓ నిర్వచించింది.

ప్రస్తుతం లభిస్తున్న వివరాల ప్రకారం జెఎన్.1 వల్ల ప్రపంచ ప్రజారోగ్యానికి తలెత్తే ముప్పు చాలా స్వల్పమని సంస్థ తెలిపింది. ఏదేమైనప్పటికీ ఉత్తర ధ్రువంలో శీతాకాల ఆగమనం కారణంగా అనేక దేశాలలో శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని సంస్థ వివరించింది. భారత్ కూడా తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. జెఎన్.1 వ్యాప్తి గురించి ఏర్పడుతున్న ఆందోళనలపై ఆరోగ్య నిపుణులు స్పందిస్తూ ముందుజాగ్రత్తలు తప్పనిసరని చెప్పారు. అయితే కొద్దికాలంలోనే వైరస్‌లు క్షీణించిపోవడం అత్యంత సహజమని, జెఎన్.1పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు తెలిపారు. భారత్‌లో ఇప్పటికే ప్రజలు ఒమిక్రాన్ వేరియంట్లతోసహా అనేక సభ్ వేరియంట్ల బారిన పడ్డారని, కొవిడ్-19కి సంబంధించి కనీసం రెండు డోసుల వ్యాక్సిన్లను కూడా పొంది ఉన్నారని, సార్స్ కొవి-2 వేరియంట్ కాని సబ్ వేరియంట్ కాని తీవ్ర అనారోగ్యంపాలు చేసే ప్రమాదం లేదని డాక్టర్ లహరియ చెప్పారు. జెఎన్.1 బారినపడిన వ్యక్తులు తీవ్రమైన లక్షణాలను కాని కొత్త లక్షణాలను కాని అనుభవించినట్లు ఎటువంటి సమాచారం లేదని, ప్రజలు ఈ వేరియంట్ గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి చెందిన ఇన్ఫెక్షియస్ డిజీజస్ కన్సల్టెంట్ డాక్టర్ కార్తీక్ వేదుల తెలిపారు.

జెఎన్.1 వేరియంట్ 2023 నవంబర్ నుంచే దేశంలో వ్యాప్తి వ్యాప్తి చెందడం మొదలై ఉంటుందని ముంబైలోని విశ్వనాథ్ క్యాన్సర్ ఫౌండేషన్ సీనియర్ కన్సల్టెంట్ విఓద్ స్కారియా అన్నారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే జెఎన్.1 ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపినట్లు ఆధారాలు ఏవీ లేవని ఆయన చెప్పారు. జెఎన్.1 మొట్టమొదట డెన్మార్క్‌లో బయటపడింది. ఆతర్వాత 2023 జులైలో ఇజ్రాయెల్‌లో బయటపడింది. జెఎన్.1తోపాటు ఇతర సార్క్ కొవి-2 వేరియంట్ల వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు, మరణాలు సంభవించకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కాపాడతయాని డబ్లుహెచ్‌ఓ తెలిపింది. డిసెంబర్ 8వ తేదీనాటిక అమెరికాలో 15 నుంచి 29 శాతం జెఎన్.1 కేసులు నమోదవుతాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంటోల్ అండ్ ప్రివెన్షన్ గత నెల మొదట్లోనే అంచనా వేసింది. చైనాలో ఇప్పటివరకు ఏడు జెఎన్.1 కేసులు వెలుగుచూశాయి. జెఎన్.1 వారినపడకుండా ఉండడానికి మాస్కులు వాడడం, చేతులు శుభ్రతంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం,

రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండడం, గాలివెలుతురు లేని చోట ఉండకపోవడం, దగ్గు వచ్చినపుడు జాగ్రత్తలు పాటించడం వంటి ముందు జాగ్రత్త చర్యలు పాటించాల్సి ఉంటుందని డాక్టర్ లహరియ సూచించారు. ఏదేమైనా జెఎన్.1 వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనడానికి ఆసుపత్రులు సంసిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. ఆరోగ్య కార్యకర్తలను, వ్యాధి నిర్ధారణ కేంద్రాలను, ఆర్‌టి పిసిఆర్ కిట్లను, జెనోమ్ సీక్వెన్సింగ్ కేంద్రాలను మొదలైన ఏర్పాట్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News