Monday, December 23, 2024

మంకీపాక్స్‌పై అప్రమత్తం… జాగ్రత్తలపై కేంద్రం సూచనలు

- Advertisement -
- Advertisement -

Central Govt issues guidelines on monkeypox

న్యూఢిల్లీ : దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 8 మంది ఈ వ్యాధి బారిన పడగా, ఒకరు మృతి చెందారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని సూచనలు చేసింది. “ మంకీపాక్స్ బాధితులను తాకినా, వారికి దగ్గరగా ఉన్నా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి. వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసుకుందాం” అని కేంద్ర ఆరోగ్యశాఖ ట్విటర్‌లో వెల్లడించింది.

కేంద్రం జారీ చేసిన సూచనల ప్రకారం
చేయాల్సినవి…
* వ్యాధి సోకిన బాధితులను ఇతరులకు దూరంగా ఐసొలేషన్‌లో ఉంచండి. శరీరంపై దద్దుర్లు పూర్తిగా తగ్గేంతవరకు బాధితులు ఐసొలేషన్‌లో ఉండాలి.
* బాధితులు మూడు లేయర్ల మాస్క్ ధరించాలి. దద్దుర్లు బయటి గాలికి తగలకుండా చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.
* బాధితులకు సమీపంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్‌లు , చేతులకు గ్లౌజులు ధరించాలి.
* ఆ తరువాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. లేదా శానిటైజర్ రాసుకోవాలి.
* బాధితులు ఉన్న ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
చేయకూడనివి…
* మంకీపాక్స్ బాధితులు ఉపయోగించే దుస్తులు, టవళ్లు, పడకను కుటుంబంలో ఇతరులు వాడకూడదు.
* బాధితులు ఉపయోగించిన దుస్తులను మిగతా వారి దుస్తులతో కలిపి ఉతక్కూడదు. వాటిని ప్రత్యేకంగా శుభ్రం చేయాలి.
* మంకీపాక్స్ లక్షణాలు కన్పిస్తే బహిరంగ ప్రదేశాలకు వెళ్ల కూడదు.
* తప్పుడు సమాచారం నమ్మి బాధితులపై వివక్ష చూపకూడదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News