Saturday, November 23, 2024

యూట్యూబ్‌లకు కేంద్రం నోటీసు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇంతకు ముందటి ట్విట్టర్ ఇప్పటి ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్ సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటీసులు వెలువరించింది. భారతదేశంలోని తమతమ ఈ సామాజిక మాధ్యమాల్లోని బాలల లైంగిక దూషణ, సంబంధిత చేష్టల డేటాను వెంటనే తొలిగించాలని ప్రభుత్వం ఆదేశించింది. తాము పేర్కొన్నట్లు వెంటనే ఈ అభ్యంతరకర మెటిరియల్స్‌ను తొలిగించకపోతే ఆయా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఎలక్ట్రానిక్స్, ఐటి వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. తగు విధంగా ఈ సంస్థలు వ్యవహరించకపోతే వీటికి ఇప్పటివరకూ ఉన్న ఐటి యాక్ట్ పరిధి భద్రతా ఏర్పాట్లను ఎత్తివేస్తారని స్పష్టం చేశారు. కొన్ని సామాజిక మాధ్యమాలలో బాలలపై లైంగిక చర్యలకు సంబంధించిన వీడియోలు వెలువడుతున్న అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ఆయా సంస్థలకు ముందుగా నోటీస్‌లు వెలువరించారు. ఇప్పుడు తుది హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News