Friday, November 22, 2024

వంటనూనెల ధరలకు కళ్లెం

- Advertisement -
- Advertisement -
central govt key decision on cooking oil prices
వచ్చే ఏడాది మార్చి 31వరకూ నిల్వలపై ఆంక్షలు

హైదరాబాద్ : దేశంలో వంటనూనె ధరల మంటలను చల్లార్చేందకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంటనూనెల ధరలను తగ్గంచేందు కు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నిల్వలపై ఆంక్షలు విధించింది. వ్యాపారుల వద్ద వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై పరిమితులు విధించాలని నిర్ణయించిం ది. వచ్చే ఏడాది మార్చి 31వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం వల్ల వంటనూనెల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. ఈ చర్య లు దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఊరట కలిగించనున్నాయని కేంద్ర ఆహార, వినియోగదారుల మం త్రిత్వశాఖ పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలు ఎంత, వాటిని ఏవిధంగా వినియోగిస్తున్నారు అనే అంశాలను పరిగణించి పరిమితులపై నిర్ణయ తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే ఎన్‌సిడిఈఎక్స్ ఫ్లాట్‌ఫామ్‌పై మస్టర్డ్ ఆయిల్ ట్రేడింగ్‌ను అక్టోబర్ 8నుంచి నిలిపివేశారు.

కొందరికి మినహాయింపు

కేంద్ర ప్రభుత్వం వంటనూనెల నిల్వలపై విధించిన ఆంక్షల నుంచి కొందిరికి మినహాంయింపు నిచ్చింది. కొంతమంది ఎగుమతి దిగుమతిదారులకు కేంద్రం ఈ మినహాయింపు ఇచ్చింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఎక్స్‌పోర్టర్ ఇంపోర్టర్ కోడ్ ఇచ్చిన వారికి మాత్రమే ఈ మినహాయింపులు వర్తిస్తాయని తెలిపింది. ఏవైనా చట్టపరమైన సంస్థలు పరిమితికి మించి వంటనూనెల నిల్వలను కలిగివుంటే , ఆ వివరాలను ప్రజా పంపిణీ వ్యవస్థ పోర్టల్‌లో పొందుపరచాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాలు ఎప్పటికప్పడు వంటనూనెలు , నూనె గింజల పరిమితులకు సంబంధించిన వివరాలను కేంద్రప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని కోరింది.

రూ.170కి చేరిన సన్‌ప్లవర్ ఆయిల్

దేశంలో వంట నూనెల ధరలు గత ఏడాది ఈ సమయానికి ఉన్న మార్కెట్‌తో పొలిస్తే 46.15 శాతంపైగానే పెరిగిపోయాయి. సన్‌ప్లవర్ ఆయిల్ గత ఏడాది రూ.122.82 ఉండగా ఇప్పుడు మార్కెట్‌లో రూ.170.09కి చేరింది. ఏడాదిలోనే 38.78శాతం పెరిగింది. పామ్‌ఆయిల్ ధర కూడా 38శాతం పెరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో రూ.95.68 ఉన్న ధరలు నేడు రూ.132.06కు పెరిగాయి. సోయా నూనె సగటు ధర గత ఏడాది ఇదే సమయంలో రూ.106గా ఉండేది. తాజాగా వీటి ధర లీటర్‌కు రూ.154.95కు చేరుకుంది. ఏడాది వ్యవధిలో ఏకంగా 45.15శాతం పెరిగింది. దేశీయంగా వంటనూనెల ధరలు ఏడాది కాలంలో ఇంత భారీగా పెరగటానికి ప్రధాన కారణాల్లో అంతర్జాతీయ కారణాలతోపాటు దేశీయంగా సరఫరా తగ్గటమే అని కేంద్ర పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News