Sunday, November 3, 2024

శత్రువుల ఆస్తులతో కేంద్రానికి రూ. 3400 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోని శత్రువుల ఆస్తుల (ఎనిమీస్ ప్రాపర్టీస్)ను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 3400 కోట్లు ఆర్జించింది. ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. ఇందులో అధిక భాగం షేర్లు, బంగారం, రెవెన్యూ రిసీట్ల వంటి చరాస్తుల రూపం లోనే ఉన్నట్టు పేర్కొంది. “ శత్రువుల ఆస్తుల ద్వారా ఆర్జించిన రూ. 3407 . 98 కోట్లను కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.

ఇందులో 152 కంపెనీలకు చెందిన 7.53 షేర్లు ఉన్నాయి. వీటి విలువ రూ.2708.9 కోట్లు. ఇక మరో రూ.699.08 కోట్లు రెవెన్యూ రిసీట్ల రూపంలో ఉన్నాయి. ” అని హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. వీటితోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మింట్ ద్వారా 2021 జనవరిలో 1699.79 గ్రాముల బంగారాన్ని విక్రయించి రూ. 49.14 లక్షలు, 28.89 కిలోల వెండి ఆభరణాలను విక్రయించి రూ.10.92 లక్షలను ఆర్జించినట్టు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు శత్రువులకు చెందిన ఎలాంటి స్థిరాస్తులను ప్రభుత్వం సొమ్ము చేసుకోలేదని తెలిపారు.

ఎనిమీ ప్రాపర్టీ అంటే…
భారత్‌-పాక్ విభజన, 1962, 1965 యుద్ధాల తరువాత భారతీయులు ఎవరైనా పాకిస్థాన్, చైనా వెళ్లేందుకు కేంద్రం అవకాశమిచ్చింది. అయితే ఆ దేశాల పౌరసత్వం తీసుకున్నవారి స్థిరచరాస్తులు కేంద్రానికి చెందుతాయని అప్పట్లో నోటిఫికేషన్ ఇచ్చింది. అలా వారు వదిలి వెళ్లిన ఆస్తులనే ఎనిమి ప్రాపర్టీ అంటారు. ఆ ఆస్తులు, భూముల నిర్వహణ బాధ్యతను సెపికి అప్పగించింది.

అలా మనదేశంలో 12.611 శత్రు ఆస్తులున్నాయి. ఇందులో 12,386 ఆస్తులు పాక్ పౌరసత్వం తీసుకున్నవారివి కాగా, మిగతా 126 చైనా జాతీయులవి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 6255 ఎనిమీ ప్రాపర్టీలను గుర్తించగా, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో 4088, ఢిల్లీలో 659, గోవాలో 295 , మహారాష్ట్రలో 208, తెలంగాణలో 158, గుజరాత్‌లో 151, త్రిపురలో 105, బీహార్‌లో 84, మధ్యప్రదేశ్‌లో 94, ఛత్తీస్‌గఢ్‌లో 78, హర్యానాలో 71 శత్రు ఆస్తులున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News