Monday, December 23, 2024

రుణ వివక్ష

- Advertisement -
- Advertisement -

Special article about quad summit in tokyo

చూడముచ్చటగా అభివృద్ధి చెందుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు అందుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి కేంద్ర పాలకులు ఈర్ష పడుతున్నట్టు ఏమాత్రం అనుమానానికి అవకాశంలేని రీతిలో రుజువైపోయింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే రుణ సేకరణను సైతం కేంద్రం అడ్డుకుంటూ ఉండడమే ఇందుకు తిరుగులేని నిదర్శనం. రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు కోసం రాష్ట్రం చేసిన అభ్యర్థనను ఏప్రిల్‌, మే నెలల్లో కేంద్రం మూడుసార్లు తిరస్కరించింది. ఇందువల్ల రూ.9వేల కోట్ల మేరకు రాష్ట్ర రుణసేకరణ యత్నాన్ని భగ్నం చేసిన కేంద్ర పాలకులు తాజాగా ఈ నెల 31న జరిగే ఆర్‌బిఐ రుణ మంజూరు కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా రాష్ట్రానికి అనుమతిని నిరాకరించింది. దీనితో ఇప్పటికి రాష్ట్రానికి రూ.11వేల కోట్లు అప్పు పుట్టకుండా చేసింది. 31న జరిగే తాజా రుణ సేకరణ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎపి సహా 11 రాష్ట్రాలకు అనుమతి ఇచ్చి తెలంగాణకే తలుపులు మూసేయడంలోని వివక్షను గురించి వివరించి చెప్పనక్కర్లేదు. రిజర్వ్ బ్యాంకు వద్ద తమ సెక్యూరిటీ బాండ్లను ఉంచి అప్పు తెచ్చుకునే హక్కు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. రాజ్యాంగం 293(3) ఇందుకు అవకాశం కల్పిస్తున్నది. రాష్ట్రాలు తమ వద్ద గల సంఘటిత నిధిని తాకట్టు పెట్టి ఈ రుణాలను ఆర్‌బిఐ నుంచి సేకరించవచ్చునని ఈ అధికరణ స్పష్టం చేస్తున్నది. అయితే అవి కేంద్రానికి తీర్చాల్సిన అప్పు బకాయిలు ఉన్నప్పుడు దాని అనుమతి తప్పనిసరి అని ఈ అధికరణ తెలియజేస్తున్నది. దీనిని ఉపయోగించుకొని ఆర్‌బిఐ రుణ మంజూరు సమయంలో తనకు ఇష్టం లేని రాష్ట్రాలను దూరంగా ఉంచి కక్ష సాధించుకునే ధోరణిని ప్రధాని మోడీ ప్రభుత్వం పాటిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పటి నుంచి గత ఎనిమిదేళ్ల కాలంలో అది సాధించిన అభివృద్ధిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వ శాఖలు వేనోళ్లతో ప్రశంసించిన సందర్భాలున్నాయి. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో పన్నెండింటిని తెలంగాణ సాధించుకున్నది. అలాగే 12 జాతీయ పంచాయతీ అవార్డులను చేజిక్కించుకుంది. ఇన్‌ఫర్మేషన్, టెక్నాలజీ రంగంలో అత్యుత్తమంగా పనిచేస్తున్నందుకు 2020లో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటి రామారావును స్కోచ్ అవార్డు వరించింది. కొల్లూరు డబుల్ బెడ్ రూం ప్రాజెక్టుకు హడ్కో అవార్డు లభించింది. పాలనలో ఉత్తమ శ్రేణిని అందుకున్న రాష్ట్రంగా 2019లో ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్ పురస్కారం రాష్ట్రానికి లభించింది. ఇంకా జాతీయ టూరిజం అవార్డు (2019), సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డు (2018), ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్‌కు, దక్షిణ మండలంలో పరిశుభ్ర నగరంగా సిద్దిపేటకు (2018) స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు లభించాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (2018) ఎకనామిక్స్ టైమ్స్ ప్రతిష్టాత్మక వాణిజ్య సంస్కర్త అవార్డును అందుకున్నారు. వాణిజ్యం, పెట్టు బడి అనుకూల వాతావరణ కల్పన, రైతులకు నేరుగా నగదు సహాయం అందించడం వంటి కా ర్యక్రమాల పరంగా కెసిఆర్ దార్శని క సారథ్యాన్ని ఎకనామిక్ టైమ్స్ అవార్డు నిర్ణేతలు మెచ్చు కున్నారు. ఇలా అన్ని రంగాల్లో అని తర స్థాయిలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి కేంద్రం పాలకులకు కన్ను కుట్టిందని భావించక తప్పడం లేదు. అప్పులు చేసే విషయంలో కేం ద్రానికి హద్దు, ఆపు ఉండదు. కాని రాష్ట్రాలపై అది పరిమితుల బండమోపుతుంది. ప్రధాని మో డీ ప్రభుత్వం గత ఎనిమిదేళ్ల పాలనలో మితిమించి చేసిన అప్పుల కారణంగా కేంద్రం రుణ భారం విపరీతంగా పెరిగిపోయి 2021మార్చి నాటికే రూ.570 బిలియన్ డాలర్లకు చేరుకున్న ది. అటువంటప్పుడు రాష్ట్రాలు తమ అవసరాలకు అప్పులు చేయడాన్ని అది నిరోధిం చడం ఎంతమాత్రం న్యాయం కాదు. చేసిన అప్పును సంపద సృష్టికి వినియోగిస్తున్నప్పుడు అది ఆయా రాష్ట్రాల ప్రగతిలో తప్పనిసరిగా ప్రతిబింబిస్తుంది. ఆ అప్పును విజయవంతంగా తీర్చివేసి రాష్ట్ర సంపదను పెంచుకోవడానికి దానివల్ల వీలుకలుగుతుంది. రాష్ట్రాలకు మూడు ఆదాయ మార్గాలున్నాయి. అందులో మొదటిది తమ సొంత వనరుల ద్వారా వచ్చే ఆదాయం. రెండోది కేంద్రం నుంచి వచ్చే నిధులు. మూడోది అప్పులు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలులోకి వచ్చిన తర్వాత సొంతంగా పన్నులు వేసి ఆదాయం పెంచుకునే అవకాశాలు రాష్ట్రాలకు దాదాపు లేకుండా పోయాయి. దాంతో అప్పులు చేయక తప్పని పరిస్థితి తలెత్తింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే జిఎస్‌టికి అంగీకరించి రాష్ట్రాలు తమ జుట్టును కేంద్రం చేతికి ఇచ్చాయి. ఈ అవకాశాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం విచక్షణా రహితంగా, కొన్ని రాష్ట్రాల పట్ల చెప్పనలవికాని వివక్షతోనూ దుర్వినియోగం చేస్తున్నది. తెలంగాణ పట్ల కేంద్ర పాలకులు చూపుతున్న కక్ష పూరిత వైఖరి అభివృద్ధి కృషిలో రాష్ట్రం చేతులను కట్టేసిందనే చెప్పాలి. ‘అమ్మ పెట్టదు, బయట తిననివ్వదు’ అనే సామెతను కేంద్రం ఆచరిస్తున్నది. ఇది ఎంతైనా ఖండించదగినది.

Central Govt refuses borrows to Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News