న్యూఢిల్లీ : చిన్న కంపెనీలు, స్టార్టప్‌లకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. దీంతో చిన్నతరహా కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తృతం చేసుకునే వెసులుబాటు కలగనుంది. కంపెనీల చట్టం 2013 ప్రకారం తమ వ్యాపారలను విస్తరించుకోవచ్చని కార్పొరేట్ వ్యవహరాల మంత్రిత్వశాఖ ప్రకటనలో తెలిపింది. రూ.4కోట్ల పెట్టుబడి కలిగి ఉండి టర్నోవర్ రూ.40కోట్లలోపు ఉన్న కంపెనీలను చిన్నతరహా కంపెనీలుగా ప్రభుత్వం పరిగణిస్తుంది. గత 18నెలల కాలంలో నిబంధనలను పునఃసమీక్షించడం ఇది రెండోసారి. ఏప్రిల్1న రూ.2కోట్లురూ.20కోట్ల పరిమితి తాజా సడలింపుతో రెట్టింపు అయింది. కొత్త నిబంధనల ప్రకారం చిన్న కంపెనీలు తమ ఆర్థిక నివేదికల్లో క్యాష్ ఫ్లో స్టేట్‌మెంట్లను చేర్చవలసిన అవసరం లేదు. సంవత్సర కాలంలో రెండు బోర్డు సమావేశాలు నిర్వహిస్తే సరిపోతుంది. అదే పెద్దకంపెనీలైతే సంవత్సర కాలంలో కనీసం నాలుగుసార్లు బోర్డు మీటింగ్‌లను నిర్వహించాలి. అదేవిధంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆడిటర్లను రొటేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సంక్షిప్త వార్షిక రిటర్న్‌లను ఫైల్ చేయవచ్చు. వాటిపై కంపెనీ సెక్రటరీ లేదా కంపెనీ డైరెక్టర్ సంతకం చేయవచ్చు. చిన్న కంపెనీల చట్టబద్ధమైన డాక్యుమెంట్లలో చాలావరకు చార్టర్డ్ అకౌంటెంట్‌లు సంతకం చేయవలసిన అవసరం లేదు.
చిన్న కంపెనీలకు పరిమితులు సడలించిన కేంద్రం
- Advertisement -
- Advertisement -
- Advertisement -