- Advertisement -
ఇకపై ఆరునెలల విరామం చాలు
న్యూఢిల్లీ : కొవిడ్ వ్యాక్సిన్ డోస్‌ల మధ్య విరామాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సవరించింది. టీకాల రెండో డోస్‌కు, మూడో డోస్ లేదా ప్రికాషన్ డోస్‌లకు ఉన్న మధ్యస్థ గడువును తగ్గించింది. ఇంతకు ముందు ఇవి పొందడానికి ఉన్న గడువు తొమ్మిది నెలలు వరకూ ఉండేది. ఇప్పుడు దీనిని ఆరు నెలలకు తగ్గించారు. ఈ డోస్‌ల మధ్య గ్యాప్‌ను తగ్గించాల్సి ఉందని ప్రభుత్వానికి చెందిన వ్యాక్సినేషన్ల సలహా మండలి ది నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టిఎజిఐ) చేసిన సిఫార్సును పరిగణనలోకి తీసుకుని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సంబంధిత అధికార సమాచారం వెలువరించింది. మార్చిన వ్యవధిని బట్టి రెండో డోస్ అదే విధంగా బూస్టర్ డోస్‌లను 26 వారాల వ్యవధిలో తీసుకోవల్సి ఉంటుంది.
- Advertisement -