Saturday, February 22, 2025

ఒమిక్రాన్ సమసిపోలేదు: కేంద్రం

- Advertisement -
- Advertisement -

Central govt said that severity of Omicron variant is still looming

 

న్యూఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ వేరియంటు తీవ్రత పూర్తిగా సమసిపోలేదని, ఇప్పటికీ పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం దీనిని సమర్థవంతంగా కట్టడి చేసిందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 23 రెట్లు ఎక్కువగా దీనిని అదుపులోకి తీసుకువచ్చామని అయితే పూర్తి స్థాయి నియంత్రణ దశ ఇప్పటికీ రాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ సోమవారం తెలిపారు. కరోనా అంతరించినా దీని మరో రూపంగా ప్రపంచంలో దీని వేరియంటుగా ఒమిక్రాన్ తలెత్తింది. దీని పరిణామాలను కేంద్రం ఎప్పటికప్పుడు గమనిస్తోందని, నామరూపాలు లేకుండా పోయిందని చెప్పలేం కానీ , నియంత్రణలో ఉందని తేల్చిచెప్పారు. ప్రపంచ స్థాయిలో ఒమిక్రాన్ నియంత్రణ నిర్వహణ భారత్‌లో భేషుగ్గా ఉందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News