Monday, December 23, 2024

తలొగ్గిన కేంద్రం..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోని నిరుద్యోగ యువత ప్రయోజనాల పరిరక్షణ కోసం జాతీయస్థాయి లో వచ్చిన ఒత్తిళ్లు, డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. ఉద్యోగాలు, ఉపాధి కోసం కళ్లల్లో వత్తులు వేసుకొ ని ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువత సమస్యలను పరిష్కరించడం కోసం జాతీయస్థాయిలో రి క్రూటింగ్ సంస్థలు నిర్వహించే పరీక్షలన్నీ తప్పనిసరిగా అన్ని ప్రముఖ ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని, అందుకు తగినట్లుగా కేంద్ర ప్ర భుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు డి మాండ్‌తో బీజం పడింది. నేపథ్యంలోనే సిఎపిఎఫ్ కానిస్టేబుల్ ఉ ద్యోగాల పరీక్షలను ప్రాంతీయ భాష ల్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ కేం ద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ, కేంద్ర సర్కార్‌పై చేసిన ఒత్తిళ్లు సత్ఫలితాల ను ఇచ్చాయి.

అంతేగాక రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటి.రామారావు ట్వీట్‌లలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. జాతీయస్థాయి నియామక సంస్థలన్నీ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహిస్తున్నాయని, కానీ సిఎపిఎఫ్ కానిస్టేబుల్ పరీక్షల్లో అలాంటి విధా నం లేకపోవడం బాధాకరమని కెటిఆర్ చేసిన ట్వీట్ జాతీయస్థాయిలో వైరల్ అయ్యింది. హిందీయేతర రా ష్ట్రాల ప్రభుత్వాలు సైతం కెసిఆర్ లేఖలకు, కెటిఆర్ ట్వీట్‌లకు విశేషంగామద్దతు పలికాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో జరిగే సిఎపిఎఫ్ కానిస్టేబుల్ నియాకాల పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి అంగీకరించింది. దీంతో హిందీయేతర భాషల రాష్ట్రాల డిమాండ్లకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గినట్లయ్యింది. కేంద్ర మంత్రిత్వశాఖల్లోని ఉద్యోగాల నియామకాలకు నిర్వహించే పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కేవలం పాఠశాల విద్య అయిన పదో తరగతి విద్యార్హతలతో నిర్వహించే ఈ కానిస్టేబుల్ పరీక్షలను కూడా ముందుగా ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాత్రమే నిర్వహించేటట్లుగా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను ట్వీట్‌లో ఉటంకిస్తూ కెటిఆర్ చేసిన కామెంట్లకు దేశంలోని హిందీయేతర రాష్ట్రాలు, నిరుద్యోగ యువత భారీగా స్పందించింది.సిఎపిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాలను కేవలం రెండు భాషలకే పరిమితం చేయడం ముమ్మాటికీ మూర్ఖత్వంతో కూడుకున్న చర్యని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరీక్షల విధానంలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం సమీక్షించుకోకపోవడం విమర్శలకు దారితీసింది. ఈ ఉద్యోగాలను కేవలం హిందీ మొదటి భాషగా ఉన్న రాష్ట్రాల అభ్యర్ధులకే దక్కుతాయని, దేశంలోని మిగతా ప్రాంతీయ భాషలున్న రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం బాధాకరమని పలువురు బిఆర్‌ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటి వరకూ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్), సిఆర్‌పిఎఫ్, సిఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్, ఇతర ఉన్నత ఉద్యోగాలకు జరిగిన పరీక్షలన్నీ కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషలకే పరిమితం కావడంతో ఈ విభాగాల్లో దేశంలోని హిందీయేతర భాషల రాష్ట్రాల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని,

ఇలాంటి పక్షపాత ధోరణులకు చరమగీతం పాడాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అన్ని భాషలకు, అన్ని రాష్ట్రాలకూ సమన్యాయం జరగాలని, దేశంలోని నిరుద్యోగులందరికీ కేంద్ర ఉద్యోగాలు దక్కేటట్లుగా చేయాలని ఉద్దేశ్యంతోనే బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆ నాయకులు వివరించారు. సీఏపిఎఫ్ కానిస్టేబుల్ పరీక్షలకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల మూలంగా తెలంగాణ రాష్ట్రంలోని అభ్యర్ధులతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మరాఠీ, కొంకణ్, అస్సామీ, బెంగాలీ, ఉర్దూ (జమ్ము కాశ్మీర్) భాషలను మాతృభాషలుగా ఉన్న రాష్ట్రాల అభ్యర్ధులకు అవకాశాల్లేకుండా చేసే కుట్రలో భాగంగానే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొన్నారనే అభిప్రాయానికి నిరుద్యోగులు లోనయ్యారని అంటున్నారు. అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాల నిరుద్యోగులకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి కెసిఆర్ కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ విమర్శల దాడిని తట్టుకోలేకనే తన నిర్ణయాన్ని మార్చుకొందని వివరించారు.

సిఏపిఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల నియామక పరీక్షలను దేశంలోని 13 ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహిస్తామని శనివారం ప్రకటించింది. తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్ధూ, పంజాబీ, మణిపురి, కొకణి భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం తెలిపింది. రానున్న 2024 జనవరి 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రాంతీయ భాషల్లోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పరీక్షలను ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలని అనేకసార్లు బిఆర్‌ఎస్ పార్టీ పెద్దలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) కేంద్ర మంత్రిత్వశాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాల పరీక్షలను కూడా 13 భాషల్లో నిర్వహించేందుకు నిర్ణయించిందని పలువురు బిఆర్‌ఎస్ నాయకులు గుర్తుచేశారు.

తాజాగా సీఏపిఎఫ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పరీక్షలను కూడా 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని ఆ నేతలు తెలిపారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని జాతీయస్థాయిలో విమర్శలను ఎదుర్కోవడంతోనే కేంద్ర ప్రభుత్వంలోని ఆయా మంత్రిత్వశాఖలు ఎలాంటి ఒంటెద్దుపోకడలు పోతున్నాయో ఇట్టే అర్ధంచేసుకోవచ్చునని అంటున్నారు. ఉద్యోగ నియామకాలకు జాతీయస్థాయిలో నోటిఫికేషన్‌లను జారీ చేసేటప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్ని భాషల నిరుద్యోగులకు సమన్యాయం కలిగే విధంగా నియమ, నిబంధనలను రూపొందించాల్సిన రిక్రూటింగ్ ఏజన్సీలు ఇలా ‘పాత చింతకాయ పచ్చడి’ నిబంధనలనే కొనసాగిస్తూ ఉద్యోగాల ప్రక్రియను చేపట్టడం కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల నిర్లక్షానికి నిలువెత్తు నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే భావనతో నిర్మితమైన దేశమనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని, అందుకే జాతీయస్థాయిలో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోందనే ఆ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చివరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపిఎస్‌సి) నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఎఎస్, ఐపిఎస్ వంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు నిర్వహించే మెయిన్స్ పరీక్షలను కూడా ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తుండగా తక్కువ స్థాయి విద్యార్హతలుండే కానిస్టేబుల్ పరీక్షలను కేవలం ఇంగ్లీషు, హిందీ భాషల్లోనే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే జాతీయస్థాయిలో వ్యతిరేకత వస్తుందనే కనీస అవగాహన కూడా లేకుండా నిర్ణయాలు తీసుకొంటున్నారంటే కేంద్రంలో ఎలాంటి పరిపాలన సాగుతుందో దీన్నిబట్టి అర్ధంచేసుకోవచ్చునని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. జెఈఈ మెయిన్స్ వంటి పరీక్షలు కూడా ప్రాంతీయ భాషల్లో జరుగుతుంటాయని, మరలాంటప్పుడు కానిస్టేబుల్, బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్ బలగాల్లో పనిచేసే కిందిస్థాయి ఉద్యోగాలను రెండు భాషలకే పరిమితం చేస్తే మిగతా ప్రాంతీయ భాషలున్న రాష్ట్రాలకు తీరని అన్యాయం చేసినట్లవుతుందనే సోయి కూడా లేకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఆనక జాతీయస్థాయిలో విమర్శలు వచ్చినదాకా వేచిచూడటం ఆ తప్పుడు నిర్ణయాలను మార్చుకోవడం జరుగుతోందని అంటున్నారు.
2024 జనవరి 1 నుంచి అమలు..
న్యూఢిల్లీ: సిఎపిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షలను ఇంగ్లీషు భాషలతో పాటుగా 13 ఇతర ప్రాంతీయ భాషల్లోనూ 2024 జనవరి 1 నుంచి నిర్వహించడానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్లు శనివారం ఒక ప్రకటనలో కేంద్ర హోం శాఖ పేర్కొంది. సిఎపిఎఫ్‌లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటుగా ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవతో ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు హోంమంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. కాగా ఈ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు.‘ ఇది చరిత్రాత్మక నిర్ణయం. ఇది మన యువత ఆకాంక్షలకు రెక్కలను తొడుగుతుంది. యువత కలలను నెరవేర్చడంలో భాష ఒక అడ్డంకి కాకుండా చూడడానికి మేము చేస్తున్న వివిధ ప్రయత్నాల్లో ఇది ఒక భాగం’ అని ప్రధాని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.ఈ నిర్ణయంతో లక్షలాది మంది అభ్యర్థులు ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసేందుకు వీలు ఏర్పడుతుందని, తద్వారా వారి ఎంపిక అవకాశాలు కూడా మెరుగుపడతాయని హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News