Saturday, November 16, 2024

భారత్ రైస్ విక్రయాలను ప్రారంభించిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బియ్యం ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో బియ్యం విక్రయాలను ప్రారంభించింది. మంగళవారం సాయంత్రం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో భారత్ రైస్ సబ్సిడీ బియ్యం విక్రయాలను ప్రారంభించారు. రాయితీ బియ్యాన్ని వినియోగదారులకు కిలో రూ.29కే అందజేయనున్నారు.దేశమంతటా మంగళవారం నుంచి నాఫెడ్ , ఎన్‌సీసీఎఫ్ , కేంద్రీయ భండార్ సహా అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ బియ్యాన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఈ ప్యాక్ చేసిన బియ్యం 5 కిలోలు, 10 కిలోల బ్యాగులలో లభ్యమవుతాయి.

దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కేంద్రం తొలుత ‘భారత్ బ్రాండ్’ కింద తక్కువ ధరకు గోధుమ పిండి, పప్పులు, ఉల్లిపాయలు, టమోటాల విక్రయాలను ప్రారంభించింది. ‘భారత్ ఆటా’ను 2023 నవంబరు 6న మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. తొలి దశలో 5 లక్షల టన్నుల భారత్ బ్రాండ్ బియ్యాన్ని విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. గత ఏడాదితో పోలిస్తే బియ్యం రిటైల్ ధరలు 13.8 శాతం, హోల్‌సేల్ ధరలు 15.7 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు సరసమైన ధరలకే బియ్యం అందించాలన్న లక్షంతో కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్‌పేరుతో బియ్యం విక్రయాలకు శ్రీకారం చుట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News