మొదటిదశ 150 ప్రైవేట్ రైళ్లలో 26 తెలుగు రాష్ట్రాలవే
రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి
మనతెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రైవేటీకరించే రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. మొదటిదఫాలో ప్రైవేటు భాగస్వామ్యంతో నడిచే 150 రైళ్లలో 26 రైళ్లు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవే ఉన్నాయి. ముందస్తుగా పలు రాష్ట్రాల్లో నడిచే రైళ్లను ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో నడపాలని గత నవంబర్‌లో రైల్వే శాఖ ప్రతిపాదన చేయగా దానికి సంబంధించి రెండు, మూడు నెలల్లో ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
26 రైళ్ల వివరాలు ఇలా…
విజయనగరం నుంచి పూరీ వరకు (వారానికి 3 సార్లు) నడిచే రైలు, హౌరా నుంచి చెన్నై మీదుగా విజయవాడకు (వారంలో 7 రోజులు), పాటలీపుత్ర నుంచి బెంగళూరు టిసిటిబి (వారానికి 5 రోజులు), గోరఖ్‌పుర్ టు బెంగళూరు టిసిటిబి (వారానికి 2 సార్లు), ప్రయాగ్‌రాజ్ సుబేదార్‌గంజ్ టు బెంగళూరు టిసిటిబి (వారానికి 2 సార్లు), సికింద్రాబాద్ టు శ్రీకాకుళం (వారానికి 7 సార్లు), హైదరాబాద్ టు తిరుపతి (వారానికి 7 సార్లు), గుంటూరు టు హైదరాబాద్ (వారానికి 7 సార్లు), గుంటూరు టు కర్నూలు (వారానికి 7 సార్లు), తిరుపతి టు వారణాసి (సికింద్రాబాద్ మీదుగా 2 సార్లు), తిరుపతి టు నర్సాపురం (విజయవాడ మీదుగా 1 సారి), విశాఖపట్నం టు విజయవాడ (వారానికి 7 సార్లు), విశాఖపట్నం టు బెంగళూరు టిసిటిబి (వారానికి 2 సార్లు), సంబల్‌పుర్ టు బెంగళూరు టిసిటిబి (వారానికి ఒకసారి), హావ్‌డా టు సికింద్రాబాద్ (వారానికి 7 సార్లు) భగత్‌కీ కోఠి (జోధ్‌పుర్) టు సికింద్రాబాద్ (వారానికి 7 సార్లు), చెన్నై టు లోకమాన్య తిలక్ టెర్మినల్ (వారానికి 2 సార్లు), చెన్నై టు తిరుపతి (వారానికి ఒకసారి), పుదుచ్చేరి టు కాచిగూడ (వారానికి 7 సార్లు), చెన్నై టు నిజాముద్దీన్ (వారానికి 7 సార్లు), కొచువేలి (తిరువనంతపురం) టు లండింగ్ (అసోం) (వారానికి 3 సార్లు), బెంగళూరు టిసిటిబి టు లండింగ్ (వారానికి 3 సార్లు), మైసూరు టు భువనేశ్వర్ (విజయవాడ మీదుగా) (వారానికి 7సార్లు), న్యూఢిల్లీ టు బెంగళూరు టిసిటిబి (వారానికి 7 సార్లు), హావ్‌డా బెంగళూరు టిసిటిబి (వారానికి 7 సార్లు), హతియా (రాంచీ, జార్ఖండ్) బెంగళూరు టిసిటిబి (వారానికి 2 సార్లు)సార్లు) నడిచే రైళ్లను ప్రైవేటీకరణ చేయనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Central Govt to Privatise 150 Trains