Friday, December 20, 2024

తెలంగాణ, ఎపిలో 10 మంది పోలీసులకు కేంద్ర హోంశాఖ ఎక్సలెన్స్ మెడల్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వివిధ కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 140 మంది పోలీసులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్స్ సాధించిన వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 140 మంది పోలీస్ సిబ్బందిలో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి 10 మంది ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 140 మంది పోలీసులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్స్ సాధించిన వివిధ రాష్ట్రాలకు చెందిన మొత్తం 140 మంది పోలీస్ సిబ్బందిలో రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధప్రదేశ్‌ల నుంచి 10 మంది ఎంపికయ్యారు.

వివరాల్లోకి వెళితే వివిధ కేసుల పరిశోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 140 మంది పోలీసులకు కేంద్ర హోంమంత్రత్వ శాఖ మెడల్స్ ను ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం అవార్డు గ్రహీతలలో 22 మంది మహిళా అధికారులు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఎపిల నుంచి 10 మంది పోలీసు అధికారులు కేంద్ర హోంశాఖ ఎక్సలెన్స్ మెడల్స్‌కు ఎంపికయ్యారు. వారి వివరాలీవిధంగా ఉన్నాయి.
తెలంగాణ నుంచి
1. మేకల తిరుపతన్న, అడిషనల్ ఎస్పీ
2. రాజుల సత్యనారాయణ రాజు, డీఎస్పీ
3. మూల జితేందర్ రెడ్డి, ఏసీపీ
4. కమ్మాపల్లి మల్లిఖార్జున కిరణ్‌కుమార్, డీఎస్పీ
5. భూపతి శ్రీనివాసరావు, ఏసీపీ
ఆంధ్రప్రదేశ్ నుంచి
1. అశోక్ కుమార్ గుంట్రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్
2. మన్సురుద్దీన్ షేక్, సర్కిల్ ఇన్స్పెక్టర్
3. ధనుంజయుడు మల్లెల, డిప్యూటీ సూపరింటెండెంట్
4. సుప్రజ కొర్లకుంట, అడిషనల్ ఎస్పీ
5. రవిచంద్ర ఉప్పుటూరి, డీఎస్పీ
కాగా, నేరాల దర్యాప్తులో ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం, ఇన్వెస్టిగేషన్ లో ఎక్సలెన్స్ ను గుర్తించడం లక్ష్యంగా 2018లో ఈ మెడల్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న ఈ అవార్డులను ప్రకటిస్తారు. ఈ ఏడాదిలో ఈ అవార్డులు అందుకున్న వారిలో సిబిఐ నుంచి 15 మంది, ఎన్‌ఐఏ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, కేరళ, రాజస్థాన్ నుంచి 09 మంది చొప్పున, తమిళనాడు నుంచి 08 మంది, మధ్యప్రదేశ్ నుంచి 07 మంది, గుజరాత్ నుంచి 06 మంది, ఇతర రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు/ సంస్థల నుంచి ఎంపిక య్యారు. వీరిలో 22 మంది మహిళా పోలీసు అధికారులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News